కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం Building collapse chennai: తమిళనాడు, చెన్నైలోని తిరువొట్టియూర్లో ఓ నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది.
అపార్ట్మెంట్ వ్యర్థాలను తొలగిస్తున్న సిబ్బంది తిరువొట్టియూర్లో ఉన్న అరవిక్కులమ్ స్లమ్ క్లియరెన్స్ రెసిడెన్సీ బోర్డును 1993లో నిర్మించారు. ఈ అపార్ట్మెంట్లో 24 నివాసాలు ఉన్నాయి. ఇటీవలే ఈ భవనంలో పగుళ్లు ఏర్పడ్డాయి.
కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం అప్రమత్తమైన అధికారులు.. ఇళ్లను ఖాళీ చేయించడం వల్ల ప్రాణనష్టం తప్పింది. కానీ భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.లక్ష పరిహారం అందించింది తమిళనాడు సర్కార్. బాధితులకు పునరావాసం కల్పించాలని ఆదేశించింది.
ఘటనాస్థలిని పరిశీలిస్తున్న అధికారులు ఘటనాస్థలిని రాష్ట్ర పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి అన్బరసన్ పరిశీలించారు.
ఇదీ చూడండి:'రోడ్డుపై ఆ పని చేయడం బ్యాన్.. అవసరమైతే 144 సెక్షన్'