తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Buffalo Theft Case : 58 ఏళ్ల క్రితం కేసులో 78 ఏళ్ల వృద్ధుడు అరెస్ట్​.. 1965లో గేదెలను చోరీ చేశాడని.. - కర్ణాటక బీదర్​ గేదె దొంగతనం కేసు

Buffalo Theft Case : 58 ఏళ్ల క్రితం నాటి గేదెలను దొంగలించిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు కర్ణాటక బీదర్ పోలీసులు. ఈ చోరీ 1965లో జరగగా.. తాజాగా పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకుని కోర్టులో ప్రవేశపెట్టారు.

buffalo theft case
buffalo theft case

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2023, 7:30 PM IST

Buffalo Theft Case :1965 నాటి ఓ కేసులో కేసులో నిందితుడిని పట్టుకున్నారు కర్ణాటక పోలీసులు. 58 ఏళ్ల తర్వాత పరారీలో ఉన్న నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు బీదర్​లోని మేఖార్ పోలీసులు. 20 ఏళ్ల వయసులో గేదెలను దొంగతనం చేయగా.. తాజాగా 78 ఏళ్ల వయసులో పట్టుకున్నారు.

ఇదీ జరిగింది
1965లో మేఖార్ పోలీస్ స్టేషన్​ పరిధిలోని మురళీధర్​రావు కులకర్ణికి చెందిన రెండు గేదెలు, ఒక దూడ కనిపించకుండా పోయాయి. దీంతో బాధితుడు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మహారాష్ట్రకు చెందిన కిషన్​ చందర్​, గణపతి వాఘ్మోర్​ను పట్టుకున్నారు. ఆ తర్వాత వీరిని కోర్టులో ప్రవేశపెట్టి.. జైలుకు తరలించారు. అనంతరం కొద్ది రోజులకు బెయిల్​పై బయటకు వచ్చిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. కోర్టు ఎన్నిసార్లు సమన్లు, వారెంట్లు జారీ చేసినా.. పట్టించుకోలేదు. కేసు విచారణలో ఉండగానే మొదటి నిందితుడు కిషన్ చందర్​ చనిపోవడం వల్ల అతడిపై కేసును కొట్టివేశారు. మరో నిందితుడు గణపతి మాత్రం కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. అయితే, తాజాగా పెండింగ్​లో ఉన్న కేసుల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు పోలీసులు. ఈ క్రమంలోనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి.. నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరు పరిచారు. ఈ దొంగతనం చేసిన సమయంలో గణపతి వయసు 20 సంవత్సరాలు కాగా.. ఇప్పుడు 78 ఏళ్ల వయసులో అరెస్ట్ అయ్యాడు.

"ఏళ్లుగా పెండింగ్​లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్న వారిని సైతం పట్టుకుని న్యాయస్థానంలో ప్రవేశపెడుతున్నాం. ఈ బృందం తాజాగా 58 ఏళ్ల నాటి క్రితం కేసును ఛేదించింది. 78 ఏళ్ల నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచింది. ఇలాంటి మరో 7 కేసులను ఈ బృందం పరిష్కరించింది."

--చెన్నబసవన్న, ఎస్​పీ బీదర్​

అంతకుముందు రెండు నెలల క్రితం కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 1988 నాటి ఓ కేసులో దోషికి 383 సంవత్సరాల జైలు శిక్ష విధించింది తమిళనాడులోని కోయంబత్తూర్ న్యాయస్థానం. అక్రమ పత్రాలు సృష్టించి ప్రభుత్వ బస్సులను వేలం వేసిన కేసులో శిక్షతో పాటు రూ. 3.32 కోట్ల జరిమానాను విధించింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అవినీతి కేసులో 35 ఏళ్ల తర్వాత నిర్దోషిగా తీర్పు

10 ఏళ్ల బాలుడి హత్య.. 29 ఏళ్ల తర్వాత తీర్పు.. దోషికి జీవిత ఖైదు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details