తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నా గేదెకు చేతబడి చేశారు.. పాలు ఇవ్వడం లేదు' - buffalo not producing milk

తన గేదె పాలు ఇవ్వడం లేదని (Buffalo not giving milk) ఓ రైతు పోలీసులను ఆశ్రయించాడు. చేతబడి చేయడం వల్లే గేదె పాలు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశాడు. చివరకు ఏమైందంటే..

Buffalo not giving milk
mp news

By

Published : Nov 15, 2021, 10:56 AM IST

పశువులను దొంగతనం చేశారని పోలీసులను ఆశ్రయించిన ఘటనలను మనం చూసి ఉంటాం.. కానీ తన గేదె పాలు ఇవ్వడం లేదంటూ (Buffalo not giving milk) మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ రైతు (Madhya Pradesh news) పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. తనకు సహాయం చేయాలని పోలీసులతో మొర పెట్టుకున్నాడు. అంతేకాదు.. గేదెకు చేతబడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

నయాగావ్‌కు చెందిన (Madhya Pradesh news) బాబులాల్‌ జాతవ్‌ అనే రైతు శనివారం ఈ ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సైతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్ల కొడుతోంది.

గత కొన్నిరోజులుగా తన గేదెకు పాలు పితికినా రావడం లేదని(Buffalo not giving milk), కొంతమంది దానికి చేతబడి చేశారని బాబులాల్‌ తెలిపినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ అరవింద్‌ షా వెల్లడించారు. ఫిర్యాదు చేసిన నాలుగు గంటల అనంతరం మళ్లీ తన గేదెతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చి న్యాయం చేయాల్సిందిగా వేడుకున్నట్లు తెలిపారు.

చివరకు పాలు ఇచ్చిన గేదె

పశుసంవర్థక శాఖ అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు సిబ్బందికి సూచించామని అరవింద్‌ షా తెలిపారు. చివరకు ఆదివారం ఉదయం గేదె పాలు ఇవ్వడంతో మళ్లీ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బాబులాల్‌ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు.

ఇదీ చదవండి:'పెళ్లి చేయండి.. లేకపోతే టవర్​పై నుంచి దూకేస్తా...'

ABOUT THE AUTHOR

...view details