Buffalo died: పిచ్చికుక్క కరిచి గేదె మృతి చెందింది. అయితే ఆ గేదె నుంచి తీసిన పాలతోనే.. మజ్జిగ చేసి పంపిణీ గ్రామంలోని ఓ కార్యక్రమంలో పంపిణీ చేశారు. విషయం తెలుసుకున్న ప్రజలు జిల్లా ఆసుపత్రికి పరుగులు తీశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో శనివారం జరిగింది. పిచ్చికుక్క కరచి గేదె మృతిచెందిన విషయం తెలవటం వల్ల గ్రామంలో గందరగోళం నెలకొంది. రేబిస్ వ్యాధి వస్తుందేమోనని.. మజ్జిగ తాగిన వారు ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి పరుగు తీశారు. రేబిస్ వ్యాక్సిన్ కోసం ఆస్పత్రి ఎదుటబారులు తీరారు.
పిచ్చికుక్క కరిచి గేదె మృతి.. ఆస్పత్రులకు జనం పరుగోపరుగు! - buffalo died due to bite of mad dog gwalior
Buffalo died: మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ఓ వింత ఘటన జరిగింది. చంద్పుర్లో ఓ పిచ్చికుక్క కరిచి గేదె మృతిచెందింది. దీంతో గ్రామస్థులు రేబిస్ వ్యాక్సిన్ కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద బారులు తీరారు. ఎందుకంటే..?
buffalo died due to bite of mad dog in gwalior
ఈ ఘటనపై స్పందించారు ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ మనీష్ శర్మ. ఇప్పటికే 40 మంది రేబిస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపారు. గేదె పాల ద్వారా వైరస్ ఇతరులకు సంక్రమించదని తాము వాళ్లకు చెప్పామన్నారు.
ఇదీ చూడండి:మరో ఆర్నెళ్ల వరకు ఉచిత రేషన్ పథకం