ఆహారం కోసం వెతుకుతున్న ఓ గేదె దూడ.. సమీపంలోని తోటలోకి ప్రవేశించింది. ఆకలి తీర్చుకుందామనే తాపత్రయంలో ఉన్న ఆ మూగజీవి.. మృత్యువు పొంచి ఉందని పసిగట్టలేకపోయింది. మేత కోసం వెల్లిన దూడపై అక్కడే ఉన్న కొందరు దుండగులు క్రూరత్వం ప్రదర్శించి.. ప్రాణాలు తీశారు. ఈ ఘటన కేరళలోని కొట్టాయం జిల్లా మనర్కడ్ మాలమ్లో జరిగింది.
తోటలోకి వచ్చిందనే అక్కసుతో ప్రాణాలు తీశారు - buffalo calf killed
తమ తోటిలోకి వచ్చిందన్న కారణంగా ఓ గేదె దూడను చెట్టుకి వెలాడదీసి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు కొందరు దుండగులు. ఈ ఘటన కేరళలోని కొట్టాయం జిల్లా మనర్కడ్ మాలమ్లో జరిగింది.
తోటలోకి వచ్చిందని చంపేశారు
తోటలోకి వచ్చిన గేదె దూడను బయటకు తోలాల్సింది పోయి.. దాని మెడకు తాడు బిగించి సమీపంలోని రబ్బరు చెట్టుకు వేలాడదీశారు. దాంతో ఊపిరాడక ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. దూడ అదే గ్రామానికి చెందిన రాజు అనే పశువుల కాపరికి చెందినదని గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. కళేబరానికి పోస్ట్మార్టం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి :సిక్కిం సీఎం ఫేస్బుక్ పేజీ హ్యాక్