రెండో దఫా బజ్డెట్ సమావేశాలను కుదించే అవకాశాలున్నట్టు పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఈ నెల 27న తొలిదశ ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు... ఉభయ సభల సమావేశాలు మంగళవారం నుంచి 11 గంటలకు ప్రారంభం కానున్నట్టు సమాచారం.
ఎన్నికలకు ముందే బడ్జెట్ సమావేశాలు ముగింపు! - బడ్జెట్ సమావేశాలు ముగింపు తేదీ
రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27 లోగా ముగించాలని ఉభయ సభలూ నిర్ణయించినట్టు పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఈ నెల 27లోగా బడ్జెట్ సమావేశాలు ముగింపు!
సోమవారం(మార్చి 8న) ప్రారంభమైన రెండో విడత బడ్జెట్ సమావేశాలు.. వాస్తవానికి ఏప్రిల్ 8న ముగియాల్సి ఉంది. అయితే.. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, వీటిని కుదించాలని ఆయా పార్టీలు కోరాయి. ఈ నేపథ్యంలో అనుకున్న సమయానికంటే ముందుగానే ఉభయ సభా సమావేశాలు ముగియనున్నాయి.