Congress Parliamentary Party: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో అర్ధభాగం సోమవారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ బృందం భేటీ అయ్యింది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసం 10 జన్‌పథ్‌లో సమావేశమయ్యారు నేతలు. ఈ భేటీకి కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, ఆనంద్ శర్మ, కే సురేశ్, జైరామ్ రమేశ్‌లు హజరయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించినట్లు కే సురేశ్ తెలిపారు.
"రానున్న పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించాం. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతులకు కనీస మద్దతు ధర, ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు వంటి కీలక అంశాలను లేవనెత్తేందుకు ప్రయత్నిస్తాం."
- మల్లికార్జున్ ఖర్జే, రాజ్యసభలో ప్రతిపక్ష నేత.