తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పేదల సంక్షేమమే బడ్జెట్ ధ్యేయం'

Modi on Budget 2022: ప్రజల అభీష్ఠానికి అనుగుణంగా కేంద్ర బడ్జెట్ ఉందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రగతిశీల బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​కు అభినందనలు తెలిపారు మోదీ.

Budget 2022
మోదీ

By

Published : Feb 1, 2022, 3:43 PM IST

Updated : Feb 1, 2022, 5:06 PM IST

Modi on Budget 2022: పేదల సంక్షేమమే కేంద్ర బడ్జెట్ ప్రధాన ధ్యేయమని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. నూతన బడ్జెట్​తో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఉద్యోగ కల్పనకు అధిక అవకాశాలున్నాయని చెప్పారు. 'ప్రజామోదం పొందిన ప్రగతిశీల బడ్జెట్' అని ప్రశంసించారు. కొవిడ్​ నుంచి తేరుకుని పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థకు సరికొత్త నమ్మకాన్నిచ్చిందని కొనియాడారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​కు అభినందనలు తెలిపారు.

"నూతన బడ్జెట్​ రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తుంది. రూ.2.25 లక్షల కోట్లు రైతుల ఖాతాలోకి నేరుగా జమ అవుతాయి. వ్యవసాయ అంకురాల ప్రోత్సాహానికి ప్రత్యేక నిధిని కేటాయించాం. ఈ బడ్జెట్ సామాన్యుడిలో సరికొత్త ఆశలను రేకెత్తించింది."

-ప్రధాని నరేంద్ర మోదీ

బడ్జెట్‌ ప్రజలందరిలో​ సరికొత్త ఆశలు చిగురించాయని ప్రధాని అన్నారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఈ పద్దు ఉందని చెప్పారు. యువతకు ఉజ్వల భవిష్యత్​ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:యూట్యూబ్​లో మోదీనే నెం.1.. సబ్​స్క్రైబర్​లు తగ్గేదేలె..!

Last Updated : Feb 1, 2022, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details