ఒకపక్క రైతుల ఉద్యమం, మరోపక్క ఆర్ధిక పరిస్థితులు, ఇంకోపక్క కరోనా ప్రభావం.. వీటన్నిటి నడుమ సమతౌల్యం సాధించడానికి నిర్మల కొంగు బిగించారు. ఆరు స్తంభాలపై ఆత్మనిర్భర్ భారత్‌ను నిలబెడుతున్నట్లు ప్రకటించిన ఆర్థికమంత్రి.. ప్రధానంగా కేటాయింపులను వాటికే పరిమితం చేశారు. గత బడ్జెట్ సవరించిన అంచనాలతో పోలిస్తే ఈసారి అంచనాలు కేవలం రూ.32,000 కోట్లే ఎక్కువ. వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబుల్లో ఏమాత్రం మార్పులు చేయకపోవడం వేతన జీవులను ఉసూరుమనిపించింది.
ఎక్కువ మొత్తంలో పీఎఫ్ వడ్డీ పొందేవారిపై పన్ను విధించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల కోసం బంగారం, వెండి సహా మరికొన్నింటిపై సెస్సు వేశారు. ఈ ఒక్క సెస్సు రూపంలోనే రూ.30,000 కోట్లు రానున్నాయని అంచనా. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్లు రాబట్టాలన్న భారీ ప్రణాళికను ఆమె పార్లమెంటు ముందుంచారు. ఆరోగ్యం, మౌలిక సదుపాయాల రంగాలు రెండు కళ్లుగా నూతన బడ్జెట్‌ను ఆమె ఆవిష్కరించారు. జాతీయ రహదారులు, రైల్వేలకు చెరో రూ.లక్ష కోట్లకు పైగా కేటాయింపులు చూపించారు. ఇవి రెండూ సహా మొత్తం మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5.54 లక్షల కోట్లు మేర నిధులు కేటాయించాలని ప్రతిపాదించారు. ప్రజారోగ్యాన్ని మినహాయిస్తే సంక్షేమ పథకాల జాడేమీ లేదు. కీలకమైన అంశాలకే ప్రాధాన్యమిస్తూ ఆదాయానికి తగినట్టే కేటాయింపులు చేశారు. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులకు పరిమితిని పెంచారు. దేశీయ తయారీ రంగానికి ఊతమిచ్చేలా కొన్నింటిపై కస్టమ్స్ సుంకాలను పెంచాలని విత్తమంత్రి ప్రతిపాదించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది మూడోసారి.
ఇవీ చూడండి:
పద్దు: ఆరోగ్యం, మౌలిక వసతులకే ప్రాధాన్యం
మౌలిక రంగానికి భారీగా నిధులు- 34.5శాతం పెంపు
సంక్షేమానికి కోత
బడ్జెట్‌లో ఈసారి కొత్త పథకాల జాడ కనిపించలేదు. ఇప్పుడు ఉన్నవాటికే ఆచితూచి కేటాయింపులు చేశారు. బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేకించి రాయితీలు, పన్ను మినహాయింపులు ఇవ్వలేదు. ఎరువులు, ఆహారం, పెట్రోలియం మీద రాయితీని బాగా తగ్గించారు. కేంద్ర పథకాలకు కేటాయింపులు నిరుడు రూ.12,63,690 కోట్లు ఉంటే ఇప్పుడు రూ.10,51,703కోట్లకి తగ్గిపోయింది.
ఇదీ చూడండి:
బడ్జెట్‌లో వేతన జీవులకు షాక్!
బడ్జెట్: ఆత్మనిర్భర భారతానికి ఆశల పద్దు
వైద్య రంగానికి జీడీపీలో 1.8%
కొవిడ్-19 కారణంగా మునుపెన్నడూ చూడని పరిస్థితులు ఏర్పడటంతో ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించింది. సవరించిన అంచనాల ప్రకారం గతేడాది వైద్య రంగానికి జీడీపీలో 1.5% కేటాయించగా ఈసారి దానిని 1.8 శాతానికి (రూ.2,23,846 కోట్లు) పెంచారు. కొవిడ్ టీకాల కోసం రూ.35,000 కోట్లు కేటాయింపు చూపించారు. పీఎం ఆత్మనిర్భర్ స్వాస్థ్ భారత్ యోజన కింద ఆరేళ్లకు రూ.64,180 కోట్లు కేటాయించనున్నారు. వెల్‌నెస్ కేంద్రాలు, సమ్మిళిత ప్రజా ఆరోగ్య ప్రయోగశాలలు, అత్యవసర ఆస్పత్రి విభాగాలను నిర్మించనున్నారు. రోగాలు రాకుండా, వస్తే నయం చేసేలా వైద్య రంగ బలోపేతానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పౌష్టికాహార పథకం, పోషణ్ అభియాన్‌ను కలిపి మిషన్ పోషణ్ 2.0ను ఆవిష్కరించారు. అంతర్జాతీయంగా మన తయారీ రంగం విజేతగా అవతరించేందుకు 2021-22 నుంచి ఐదేళ్లలో రూ.1.97 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది. మొత్తం 13 రంగాల్లో అభివృద్ధి జరగనుంది. 100% బ్రాడ్‌గేజ్ రైలుమార్గాల్లో విద్యుదీకరణ 2023కు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.