రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్వాదీ పార్టీ స్వతంత్రంగా పోటీచేస్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి సోమవారం ప్రకటించారు. బంగాల్, తమిళనాడు, కేరళ సహా పుదుచ్చేరి ఎన్నికల్లో ఏ పార్టీతోనూ కలవమని స్పష్టం చేశారు. ఏ కూటమిలో చేరినా బీఎస్పీకి నష్టమే జరుగుతోందని అభిప్రాయపడ్డారు.
"ఎన్నికలపై అంతర్గతంగా కృషి చేస్తున్నాము. పార్టీ ప్రణాళికను వెల్లడించము. గత ఎన్నికల్లో ఇతర పార్టీలతో చేతులు కలిపిన ప్రతిసారీ చేదు అనుభవమే ఎదురైంది. మా పార్టీ కార్యకర్తలు, నేతలు, ఓటర్లు క్రమశిక్షణతో మెలుగుతారు. ఇతర పార్టీల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కూటమిలో ఉండటం వల్ల మా ఓట్లు ఇతర పార్టీలకు వెళ్తున్నాయి కానీ.. వారి ఓట్లు మా పార్టీకి రావట్లేదు."
-మాయావతి, బీఎస్పీ అధినేత్రి