పంజాబ్ పఠాన్కోట్ ప్రాంతంలోని భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు గుండా చొరబాటుకు కుట్రపన్నిన ముగ్గురు పాక్ ముష్కరులను సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) నిలువరించింది. బలగాలు కాల్పుల జరిపిన నేపథ్యంలో వెనక్కిపారిపోయారు ముష్కరులు.
ఉగ్ర కుట్ర భగ్నం- పారిపోయిన ముష్కరులు - చొరబాటును అడ్డుకున్న బీఎస్ఎఫ్
భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రమూకలను పరుగులు పెట్టించాయి భద్రతా దళాలు. భారత్-పాకిస్థాన్ సరిహద్దు వెంబడి పంజాబ్ పఠాన్కోట్లో ప్రవేశించేందుకు యత్నించిగా సరిహద్దు భద్రతా దళం ఉగ్రవాదులను నిలువరించింది.
బీఎస్ఎఫ్, చొరబాటు
బుధవారం రాత్రి 10.15 గంటలకు భారత్లోకి ప్రవేశించేందుకు యత్నించిన వారిపై కాల్పులు జరిపినట్లు బీఎస్ఎఫ్ అధికారి పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ఆందోళనకర స్థాయిలో దిల్లీలో ఆక్సిజన్ నిల్వలు
Last Updated : Apr 22, 2021, 2:22 PM IST