తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో పాక్​ చొరబాటుదారుడు హతం - పాక్ చొరబాటుదారుడు హతం

జమ్ముకశ్మీర్​లోని​ భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దు గుండా.. భారత్​లోకి చొరబడేందుకు ప్రయత్నించిన దుండగుడిని భద్రతా దళాలు హతమార్చాయి. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.

pak intruder died
బీఎస్ఎఫ్

By

Published : May 6, 2021, 11:08 AM IST

జమ్ముకశ్మీర్​లోని పాక్​ అంతర్జాతీయ సరిహద్దు వద్ద చొరబాటు యత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి. పాకిస్థాన్ ​నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు యత్నించిన చొరబాటుదారుడిని భారత సైన్యం కాల్చి చంపింది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు.. సాంబ జిల్లాలోని సరిహద్దు ప్రాంతంలో జరిగినట్లు బీఎస్​ఎఫ్ అధికారులు పేర్కొన్నారు.

ముందుగా హెచ్చరించినా చొరబాటుదారుడు అక్రమంగా భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు యత్నించాడని అధికారులు తెలిపారు. చొరబాటుదారుడి మృతదేహం ఇంకా ఘటనా స్థలంలోనే ఉందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'కాంగ్రెస్ వైఫల్యంపై సమీక్ష జరపాలి'

ABOUT THE AUTHOR

...view details