BSF seized pakistan boat: పంజాబ్, ఫిరోజ్‌పుర్ జిల్లాలోని సరిహద్దు ఔట్‌పోస్ట్‌కు సమీపంలో వదిలివేసిన ఓ పాకిస్థాన్ బోట్‌ను గుర్తించింది సరిహద్దు భద్రతా దళం. అంతర్జాతీయ సరిహద్దుకు అతి సమీపంలో ఉండటం వల్ల ఫిరోజ్‌పుర్ అత్యంత సున్నితమైన ప్రాంతమని.. గతంలో ఇక్కడ పాకిస్థాన్ డ్రోన్లు భారత భూభాగంలోకి వచ్చిన సంఘటనలు ఉన్నట్లు పేర్కొంది.
136వ బెటాలియన్‌కు చెందిన సిబ్బంది డీటీ మాల్ బార్డర్ ఔట్‌పోస్ట్ సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. చెక్క బోటును గుర్తించినట్లు బీఎస్ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
" శీతాకాలంలో ఈ ప్రాంతం పూర్తిగా పొగమంచుతో కప్పి ఉంటుంది. చెక్క పడవను గుర్తించిన తర్వాత ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టాం. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని గ్రామస్థులను అప్రమత్తం చేశాం. అలాంటి బోట్లు తరుచుగా మత్తు పదార్థలు, ఆయుధాల అక్రమ రవాణాకు ఉపయోగిస్తుంటారు."