పంజాబ్‌లోని భారత్- పాక్ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ కలకలం చెలరేగింది. అనుమానాస్పదంగా ఉన్న ఓ డ్రోన్‌ను సరిహద్దు భద్రతా సిబ్బంది కూల్చేశారు. ఈ ఘటన పంజాబ్‌లోని తార్న్తరాన్ జిల్లాలో జరిగినట్లు అధికారులు తెలిపారు.
సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ కలకలం-కూల్చేసిన సైన్యం - undefined
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో అనుమానంగా సంచరిస్తున్న డ్రోన్‌ను అధికారులు కూల్చివేశారు. ఈ ఘటన తార్న్తరాన్ జిల్లాలో జరిగింది.
డ్రోన్ కలకలం
డ్రోన్ చక్కర్లు కొడుతుండడం గమనించిన అధికారులు వెంటనే అప్రమత్తమైనట్లు అధికారులు తెలిపారు. ఆనంతరం దానిపై కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. అయితే ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ డ్రోన్ నుంచి ఎటువంటి పేలుడు పదార్థాలు, మరే ఇతర అనుమానిత వస్తువులు స్వాధీనం చేసుకోలేదని వివరించారు.
ఇదీ చూడండి:7 గంటల్లో 101 మంది మహిళలకు ఆపరేషన్..!
Last Updated : Sep 5, 2021, 1:26 AM IST