పాక్ దుశ్చర్యకు బీఎస్ఎఫ్ అధికారి బలి - కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు
![పాక్ దుశ్చర్యకు బీఎస్ఎఫ్ అధికారి బలి firing by Pakistani troops](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9724849-961-9724849-1606811914849.jpg)
13:55 December 01
పాక్ సైన్యం కాల్పులు
సరిహద్దుల్లో పాకిస్థాన్ దుశ్చర్చలకు పాల్పడుతూనే ఉంది. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. తాజాగా జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి దాయాది సైన్యం ఏకపక్షంగా కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)కు చెందిన అధికారి ఒకరు అమరులయ్యారు.
జిల్లాలోని మేంధార్ సెక్టార్ తార్కుండి ప్రాంతంలోని సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. భారత సేనలు దీటుగా సమాధానమిచ్చాయని చెప్పారు.