తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎస్సై నోటిఫికేషన్ వచ్చేసింది... ఇంజినీర్ పోస్టులకు కూడా.. - ఇంజినీర్ పోస్టులు బీఎస్ఎఫ్

భద్రతా దళాల్లో చేరాలని రాత్రింబవళ్లు కష్టపడుతున్న నిరుద్యోగులకు శుభవార్త! సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)లో చేరే సువర్ణ అవకాశం వచ్చింది. ఇన్​స్పెక్టర్, సబ్ఇన్​స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.

BSF NOTIFICATION
BSF NOTIFICATION

By

Published : Apr 19, 2022, 5:33 PM IST

BSF recruitment 2022:సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) నుంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఇన్​స్పెక్టర్, సబ్​ఇన్​స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది బీఎస్ఎఫ్. వీటితో పాటు జూనియర్ ఇంజినీర్, సబ్​ఇన్​స్పెక్టర్(ఎలక్ట్రికల్) పోస్టులను సైతం భర్తీ చేయనుంది. మే 30వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. మొత్తం పోస్టులు, అర్హతలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఖాళీల వివరాలు:
*ఇన్​స్పెక్టర్ (ఆర్కిటెక్ట్)- 01
*సబ్​ ఇన్​స్పెక్టర్ (పనులు)- 57
*జూనియర్ ఇంజినీర్/ సబ్ ఇన్​స్పెక్టర్ (ఎలక్ట్రికల్)- 32

అర్హతలు
*ఇన్​స్పెక్టర్ (ఆర్కిటెక్ట్): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆర్కిటెక్ట్​లో డిగ్రీ సర్టిఫికెట్ సంపాదించి ఉండాలి. 1972 ఆర్కిటెక్ట్స్ యాక్ట్ ప్రకారం ఆర్కిటెక్చర్ మండలిలో నమోదు చేసుకొని ఉండాలి.
సబ్ఇన్​స్పెక్టర్ (పనులు): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు ఉన్న విద్యాసంస్థ నుంచి సివిల్ ఇంజినీర్​లో మూడేళ్ల డిప్లొమా ఉండాలి.
*జూనియర్ ఇంజినీర్/ సబ్​ఇన్​స్పెక్టర్ (ఎలక్ట్రికల్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు ఉన్న విద్యాసంస్థ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీర్​లో మూడేళ్ల డిప్లొమా ఉండాలి.
వయసు నిబంధన:అభ్యర్థుల వయసు 30 ఏళ్లకు మించకూడదు

నెలవారీ వేతనం ఇలా...:
*ఇన్​స్పెక్టర్ (ఆర్కిటెక్ట్)- రూ.44,900- రూ.1,42,400 మధ్య ఉంటుంది.
*సబ్​ ఇన్​స్పెక్టర్ (పనులు)- రూ.35,400- రూ.1,12,400
*జూనియర్ ఇంజినీర్/ సబ్ ఇన్​స్పెక్టర్ (ఎలక్ట్రికల్)- రూ.35,400- రూ.1,12,400

దరఖాస్తు ఇలా...:
అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా దరఖాస్తు ఫారం నింపవచ్చు. rectt.bsf.gov.in వెబ్​సైట్​లో అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. మే 30 చివరి తేదీ.

ఇదీ చదవండి:

గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్సై అభ్యర్థులకు ఉచిత శిక్షణ... నెలనెలకు స్టైఫండ్‌

ప్రభుత్వ సంస్థలో అదిరే ఉద్యోగాలు.. జీతం నెలకు రూ.90వేలు.. అప్లై చేయండిలా...

ABOUT THE AUTHOR

...view details