BSF jawan death: రాజస్థాన్ జైసల్మేర్‌లో విషాదకర ఘటన జరిగింది. కిషన్‌గంజ్‌లోని బీఎస్ఎఫ్ ఫైరింగ్ రేంజ్లో.. ఆదివారం సాధనా కార్యక్రమం జరుగుతుండగా.. ఓ మోర్టార్ షెల్ పేలింది. ఈ ఘటనలో గాయపడిన 9మందిని స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సందీప్ కుమార్ అనే జవాను ప్రాణాలు కోల్పోయారు.
సందీప్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఆ తర్వాత మృతదేహాన్ని ఆయన బంధువులకు అప్పగించనున్నారు.
జవాన్లందరూ పంజాబ్ ఫ్రాంటియర్‌లోని 136వ బెటాలియన్‌కు చెందినవారు.