పశువుల అక్రమ రవాణా చేస్తున్న ఓ బంగ్లాదేశ్ వాసిని హతమార్చారు ఉత్తర త్రిపుర కదంతలా ప్రాంతంలోని సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) అధికారులు. నిందితుడిని బప్ప మియాగా గుర్తించారు. ఇప్పటికే ఆయనపై పశువుల అక్రమ రవాణాకు సంబంధించి పలు కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.
దాదాపు 12 మంది రెండు వర్గాలుగా విడిపోయి భారత్-బంగ్లాదేశ్లో పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని యాకూబ్ నగర్ సరిహద్దు బీఎస్ఎస్ అధికారులు వెల్లడించారు. సరిహద్దును దాటేందుకు ప్రయత్నించిన కొందరిని హెచ్చరించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో దుండగులు వారిపై రాళ్లు రువ్వారని అధికారులు వెల్లడించారు.