తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో పాక్​ చొరబాటుదారుడి అరెస్ట్​ - భారత సరిహద్దు

జమ్ముకశ్మీర్​లోని​ అంతర్జాతీయ సరిహద్దు గుండా.. భారత్​లోకి ప్రవేశించేందుకు యత్నించిన పాక్​ చొరబాటుదారుడిని బీఎస్​ఎఫ్​ బలగాలు అరెస్టు చేశాయి. జవాన్లు జరిపిన కాల్పుల్లో అతడికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు.

BSF
బీఎస్​ఎఫ్​

By

Published : May 19, 2021, 9:07 AM IST

జమ్ముకశ్మీర్​లోని​ అంతర్జాతీయ సరిహద్దు వద్ద చొరబాటు కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. పాకిస్థాన్ ​నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు యత్నించిన ఓ చొరబాటుదారుడిని సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్​) అరెస్టు చేసింది.

సాంబ సెక్టార్​ వద్ద భారత సరిహద్దులోకి ప్రవేశించేందుకు యత్నించిన దుండగుడిపై బీఎస్​ఎప్​ జవాన్లు కాల్పులు జరిపినట్లు ​ అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో చొరబాటుదారుడికి గాయాలైనట్లు చెప్పారు.

బీఎస్​ఎఫ్​ జవాన్లు

"చొరబాటుదారుడు తన పేరు అసిఫ్​ అని చెప్పాడు. తాను పాకిస్థాన్​ లాహోర్​లో నివసిస్తానని తెలిపాడు. మెరుగైన చికిత్స కోసం జమ్ములోని ఆస్పత్రికి తరలించాం." అని సాంబలోని విజయ్​పుర్​ ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్​ చందర్​ మోహన్ తెలిపారు.

వైద్యాధికారి డాక్టర్​ చందర్​ మోహన్

ఇదీ చూడండి:యూపీ మంత్రి విజయ్ కశ్యప్ కరోనాతో మృతి

ఇదీ చూడండి:యాంటీబాడీ టెస్టు ఏంటీ? ఎందుకోసం?

ABOUT THE AUTHOR

...view details