తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్ సరిహద్దులో చొరబాటుదారుడు అరెస్ట్​ - international border news

భారత భూభాగంలోకి చొరబాటుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని సరిహద్దు భద్రతా దళం పట్టుకుంది. అతన్ని పాకిస్థాన్​కు చెందిన షబ్బీర్​గా అధికారులు గుర్తించారు.

BSF arrests Pakistani intruder near International border in Jammu
అక్రమ చొరబాటుదారుడు అరెస్ట్​

By

Published : Apr 14, 2021, 4:58 AM IST

జమ్ము కశ్మీర్​లోని భారత్-పాకిస్థాన్​ సరిహద్దు వద్ద అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని సరిహద్దు భద్రతా సిబ్బంది అరెస్టు చేశారు. పాకిస్థాన్​కు చెందిన ఆ వ్యక్తిని షబ్బీర్​గా గుర్తించారు. ఆర్ఎస్​ పురా ప్రాంతంలో ఉండే.. స్తంభం నంబర్ 942 దగ్గర సరిహద్దు దాటడానికి షబ్బీర్ ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు.

"షబ్బీర్​ అనే వ్యక్తి సరిహద్దు వద్ద ఉండే కంచె దాటడానికి ప్రయత్నం చేశాడు. తొలుత అతడిని సైన్యం హెచ్చరించింది. కానీ అతను వినలేదు. దీంతో కాల్పులు జరిపాం. అతడికి స్వల్పంగా గాయాలయ్యాయి."

-బీఎస్​ఎఫ్​ సీనియర్​ అధికారి

ఇదీ చూడండి:దేశ రక్షణకు మోదీ సర్కార్ 'హైవే స్కెచ్​'!

ABOUT THE AUTHOR

...view details