తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న కొద్దీ వ్యూహాలకు పదును - అధికార పీఠాన్ని నిలబెట్టుకునేందుకు శ్రమిస్తున్న గులాబీదళం - BRS ఎన్నికల ప్రచారంలో వేగం పెంచింది

BRS Plans For Telangana Assembly Elections 2023 : అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్‌ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ.. అధికార పార్టీ బీఆర్ఎస్ తన వ్యూహాలకు పదును పెడుతోంది. అధికార పీఠాన్ని నిలబెట్టుకునేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని ఒడిసి పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రచారం, పోల్‌ మేనేజ్‌మెంట్‌తో పాటు చేరికలపైనా దృష్టి సారించింది. ఇతర పార్టీల్లో ఎవరైనా అంసతృప్తితో ఉన్నారని తెలిస్తే.. బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు.. ఆ నేతల ఇళ్లలో వాలిపోతున్నారు. చర్చలు జరిపి గులాబీ కండువా కప్పుతున్నారు. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ అభ్యర్థులు, నాయకులు సైతం ఇదే మంత్రాన్ని అనుసరిస్తూ ముందకెళ్తున్నారు.

BRS Plans For Telangana Assembly Elections 2023
Telangana Assembly Elections 2023

By ETV Bharat Telugu Team

Published : Nov 17, 2023, 6:05 AM IST

పోలీంగ్‌ తేదీ సమీపిస్తున్న కొద్దీ వ్యూహాలకు పదును - అధికార పీఠాన్ని నిలబెట్టుకునేందుకు శ్రమిస్తున్న గులాబీదళం

BRS Plans For Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి సర్వశక్తులూ ఓడ్డుతోంది. ప్రచారం, పోల్‌ మేనేజ్‌మెంట్‌, చేరికలు సహా గెలుపును ప్రభావితం చేసే ఏ ఒక్క అంశాన్ని వదిలి పెట్టడం లేదు. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థుల్ని ప్రకటించిన గులాబీ దళపతి కేసీఆర్‌(CM KCR).. ఎన్నికల రణక్షేత్రంలోకి అడుగుపెట్టారు.

BRS Speed Up on Election Campaign : మేనిఫెస్టో ప్రకటించిన రోజే అభ్యర్థులకు బీఫామ్‌లు అందించి ప్రచారంలోకి దిగారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్ని చుట్టేసేలా రోజుకు 3 నుంచి 4 సభల వరకు పాల్గొంటున్న కేసీఆర్‌.. బీఆర్ఎస్ సర్కార్‌(BRS Government) అభివృద్ధిని వివరిస్తూ.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కేసీఆర్‌కుతోడు బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌, పార్టీ అగ్రనేత హరీశ్‌రావు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు, రోడ్‌ షోలతో దూసుకుపోతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారాలతో దూకుడు చూపిస్తున్నారు.

BRS Election Campaign in Telangana :హ్యాట్రిక్‌ కొట్టాలనే కసితో ఉన్న బీఆర్ఎస్.. చేరికలపై దృష్టి సారించింది. అభ్యర్థులు ప్రకటించిన తర్వాత సీటు దక్కని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలలో కొందరు, ముఖ్యనేతలు.. అసంతృప్తితో ఇతర పార్టీల్లో చేరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వంటి నేతలు కారు దిగి.. చెయ్యి అందుకున్నారు. కొంత నిరాశకు గురైనట్లు అనిపించిన బీఆర్ఎస్.. మళ్లీ దూకుడు పెంచింది.

కాంగ్రెస్‌, బీజేపీలో టిక్కెట్లు దక్కని సీనియర్‌ నేతలకు గులాబీ కండువా కప్పడంలో విజయవంతమైంది. మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీనియర్‌ నేత నాగం జనార్ధన్‌రెడ్డి, తెలంగాణ ఉద్యమకారులు జిట్టా బాలకృష్ణారెడ్డి, చెరుకు సుధాకర్‌ వంటి వారిని పార్టీలో చేర్చుకుంది. వైఎస్సార్​టీపీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిసి ఆ పార్టీ నేతలకూ గులాబీ తీర్థం ఇచ్చింది. గాయకుడు ఏపూరి సొమన్న, సీనియర్‌ నేత గట్టు రామచంద్రరావును కారు ఎక్కించుకుంది.

BRS Assembly Elections Campaign 2023 : ప్రచారంలో దూసుకెళ్తోన్న బీఆర్​ఎస్​.. 24 గంటల కరెంటే ప్రధాన ఎజెండాగా జనంలోకి

BRS Leaders Focus on Joinings in Telangana :ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్నారని తెలిస్తే చాలు.. బీఆర్ఎస్ అగ్రనేతలు వారిపై దృష్టి పెడుతున్నారు. కేటీఆర్‌, హరీశ్‌రావు.. ఏకంగా వారి ఇంటికే వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. టిక్కెట్‌ దక్కలేదనే అలకతో పార్టీని వీడిన ఎల్బీనగర్‌ నేత రామ్మోహన్‌గౌడ్‌ను.. మూడు రోజుల్లోనే మళ్లీ గులాబీ గూటి చేర్చడంలో హరీశ్‌రావు విజయవంతమయ్యారు.

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కీలక నేతగా ఉన్న గాలి అనికుమార్‌.. కాంగ్రెస్‌ నుంచి పటాన్‌చెరు లేదా నర్సాపూర్‌ టిక్కెట్‌లో ఏదో ఒకటి దక్కుతుందని భావించారు. రెండు చోట్లా చెయ్యి పార్టీ.. చెయ్యి ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తితో రాజీనామా చేశారు. ఈ విషయం తెలిసిన హరీశ్‌రావు తెల్లారేసరికే గాలి అనిల్‌కుమార్‌ ఇంటికి వెళ్లారు. బీఆర్ఎస్​లోకి రావాలని ఆహ్వానించగా.. ఆయన సుముఖత వ్యక్తం చేశారు. సంగారెడ్డి బీజేపీ టిక్కెట్‌ ఆశించిన భంగపడిన రాజేశ్వరరావు దేశ్‌పాండేను పార్టీలోకి ఆహ్వానించారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లేపల్లిలోని దేశ్‌పాండే ఇంటికి వెళ్లి హరీశ్‌రావు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. నర్సాపూర్‌లో జరిగే సీఎం కేసీఆర్‌ సభలో గూలాబీ కండువా కప్పుకునేందుకు గాలి అనిల్‌కుమార్‌, రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే సిద్ధమయ్యారు.

Telangana Assembly Elections 2023 :రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట్‌కు చెందిన కాంగ్రెస్‌ నేత దండెం రాంరెడ్డి.. ఇబ్రహీంపట్నం ఆశించి భంగపడ్డారు. రెబల్ అభ్యర్థిగా వేసిన నామినేషన్‌ను వెనక్కితీసుకున్నారు. దండెం రాంరెడ్డితో మంతనాలు జరిపిన కేటీఆర్‌.. ఆయన్ని గూలాబీ గూటికి తీసుకురావడంతో విజయవంతమయ్యారు. బీఆర్ఎస్ అగ్రనేతలే కాదు.. ఆ పార్టీ అభ్యర్థులు, ముఖ్యనేతలు నియోజకవర్గ స్థాయిలోనూ ఇదే మంత్రాన్ని పాటిస్తున్నారు. ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్నవారితో చర్చించి పార్టీలో చేర్చుకుంటున్నారు. వరసగా మూడోసారి అధికార పీఠాన్ని అందుకోవడానికి ఉన్న ఏ అవకాశాన్ని బీఆర్ఎస్ వదులుకోవడం లేదు. తన సాధనసంపత్తిని అంతా ఉపయోగిస్తూ.. అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రంలో ముందుకెళ్తోంది.

కారు స్పీడ్ పెంచిన నేతలు - గులాబీ జెండాకు మద్దతివ్వాలంటూ ఊరూవాడా ప్రచారం

BRS 30 Days Election Campaign Plan : బీఆర్ఎస్​ సరికొత్త ప్లాన్​.. విజయం సాధించేందుకు 'స్వాతిముత్యం' ఫార్ములా

ABOUT THE AUTHOR

...view details