తెలంగాణ

telangana

ETV Bharat / bharat

BRS MLAs Final Candidates List 2023 : బీఆర్​ఎస్​ గెలుపు గుర్రాలివే.. తొలి జాబితా ప్రకటించిన కేసీఆర్! - బీఆర్ఎస్ మొదటి జాబితాలో ఎన్ని సీట్లు

BRS MLA Candidates First List 2023 : తెలంగాణలోని రాజకీయ పక్షాలు మొదలు.. బీఆర్​ఎస్​లోని సాధారణ కార్యకర్తల వరకూ.. అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన సమయం రానే వచ్చేసింది. తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల యుద్ధానికి సమరం శంఖం పూరించిన ప్రభుత్వాధినేత కేసీఆర్.. తమ పార్టీ తరపున బరిలో నిలవబోయే గెలుపు గుర్రాల మొదటి జాబితాను విడుదల చేశారు.

BRS MLAs Candidates First List 2023
BRS MLAs Final Candidates List 2023

By

Published : Aug 21, 2023, 3:08 PM IST

Updated : Aug 21, 2023, 5:06 PM IST

BRS Candidates List 2023 : తెలంగాణలోని రాజకీయ పక్షాలు మొదలు.. బీఆర్​ఎస్​లోని సాధారణ కార్యకర్తల వరకూ.. అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన సమయం రానే వచ్చేసింది. తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల యుద్ధానికి సమరం శంఖం పూరించిన ప్రభుత్వాధినేత కేసీఆర్.. తమ పార్టీ తరపున బరిలో నిలవబోయే గెలుపు గుర్రాల మొదటి జాబితాను విడుదల చేశారు. తొలి జాబితాలోనే ఏకంగా 115 మంది అభ్యర్థులకు (BRS MLA Candidates List 2023) టికెట్లు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ జాబితా ప్రకటనతో.. రాష్ట్రంలో ఎలక్షన్ సైరన్ మోగినట్టైంది.

అంచనాలు తారుమారు..

ఈ దఫా.. సిట్టింగుల్లో చాలా మందికి చోటు దక్కదనే ప్రచారం జరిగింది. దాదాపు 30 మంది వరకూ ఇంటికి వెళ్తారనే చర్చ జోరుగా సాగింది. కానీ.. అంచనాలను తారు మారు చేస్తూ.. స్వల్ప మార్పులు మాత్రమే చేపట్టారు కేసీఆర్. కేవలం 7 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మారుస్తున్నట్టు ప్రకటించారు.

సీటు సాధించిన అభ్యర్థులు వీరే..

BRS MLA Candidates First List :

(ఉమ్మడి అదిలాబాద్ )

సిర్పూర్ - కోనేరు కోనప్ప

చెన్నూరు - బాల్క సుమన్

బెల్లంపల్లి - దుర్గం చెన్నయ్య

మంచిర్యాల- దివాకర్ రావు

అదిలాబాద్ - జోగు రామన్న

బోథ్ - అనిల్ జాదవ్

నిర్మల్ - ఆల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

ముథోల్ -గడ్డి గారి విఠల్ రెడ్డి

ఆసిఫాబాద్- కోవా లక్ష్మి

ఖానాపూర్-జాన్సన్ నాయక్

(ఉమ్మడి నిజామాబాద్)

ఆర్మూర్ -ఆశన్నగారి జీవన్ రెడ్డి

బోధన్ - షకీల్ అహ్మద్

జుక్కల్ - హనుమంత్ షిండే

బాన్సువాడ - పోచారం శ్రీనివాస్ రెడ్డి

ఎల్లారెడ్డి - జాజుల సురేందర్

కామారెడ్డి- కే. చంద్రశేఖర రావు (KCR)

నిజామాబాద్ అర్బన్ - గణేష్ బిగాల

నిజామాబాద్ రూరల్ - బాజిరెడ్డి గోవర్ధన్

బాల్కొండ - వేముల ప్రశాంత్ రెడ్డి

(ఉమ్మడి కరీంనగర్)

కోరుట్ల - కల్వకుంట్ల సంజయ్

జగిత్యాల -ఎం. సంజయ్ కుమార్

ధర్మపురి- కొప్పుల ఈశ్వర్

మంథని -పుట్టా మధు

పెద్దపల్లి-దాసరి మనోహర్ రెడ్డి

కరీంనగర్ - గంగుల కమలాకర్

సిరిసిల్ల - కేటీఆర్

చొప్పదండి-సుంకే రవిశంకర్

వేములవాడ- లక్ష్మీ నరసింహారావు

మానుకొండూరు - రసమయి బాలకిషన్

హుస్నాబాద్ - వొడితెల సతీష్ కుమార్

హుజూరాబాద్- పాడి కౌశిక్ రెడ్డి

రామగుండం - కోరుకంటి చందర్

(ఉమ్మడి మెదక్)

సిద్దిపేట - తన్నీరు హరీష్ రావు

మెదక్- పద్మా దేవేందర్ రెడ్డి

నారాయణఖేడ్ - ఎం. భూపాల్ రెడ్డి

ఆంథోల్ -చంటి క్రాంతి కిరణ్

నర్సాపూర్ -

జహీరాబాద్-మాణిక్ రావు

సంగారెడ్డి- చింతా ప్రభాకర్

పఠాన్ చెరు - గూడెం మహిపాల్ రెడ్డి

దుబ్బాక - కొత్త ప్రభాకర్ రెడ్డి

గజ్వేల్ - కేసీఆర్

(ఉమ్మడి రంగారెడ్డి)

మేడ్చల్ - చామకూర మల్లారెడ్డి

మల్కాజ్ గిరి - మైనంపల్లి హన్మంతరావు

కుత్బుల్లాపూర్ - కేపీ వివేకానంద గౌడ్

కూకట్ పల్లి - మాధవరం కృష్ణారావు

ఉప్పల్ - బండారు లక్ష్మారెడ్డి

ఇబ్రహీంపట్నం - మంచిరెడ్డి కిషన్ రెడ్డి

ఎల్బీ నగర్ - దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

మహేశ్వరం - సబితా ఇంద్రారెడ్డి

రాజేంద్ర నగర్ - ప్రకాష్ గౌడ్

శేరిలింగంపల్లి - అరికెపూడి గాంధీ

చేవెళ్ల - కాలె యాదయ్య

పరిగి-మహేశ్వర్ రెడ్డి

వికారాబాద్ - మెతుకు ఆనంద్

తాండూర్ - పైలట్ రోహిత్ రెడ్డి

(ఉమ్మడి హైదరాబాద్)

ముషీరాబాద్ - ముఠా గోపాల్

మలక్ పేట్ - తీగల అజిత్ రెడ్డి

అంబర్ పేట - కాలేరు వెంకటేష్

ఖైరతాబాద్ - దానం నాగేందర్

జూబ్లీహిల్స్ - మాగంటి గోపీనాథ్

సనత్ నగర్ - తలసాని శ్రీనివాస్ యాదవ్

నాంపల్లి-

కార్వాన్- ఐందాల క్రిష్ణయ్య

గోషామహల్-

చార్మినార్- ఇబ్రహీం లోడీ

చాంద్రాయణగుట్ట- సీతారాం రెడ్డి

యాకుత్ పురా - సామ సుందర్ రెడ్డి

బహదూర్ పుర- అలీ బక్రీ

సికింద్రాబాద్ - టి.పద్మారావు

సికింద్రాబాద్ కంటోన్మెంట్- లాస్య నందిత

(ఉమ్మడి మహబూబ్ నగర్)

కొడంగల్ - పట్నం నరేందర్

నారాయణ్ పేట్ - ఎస్.రాజేందర్ రెడ్డి

మహబూబ్ నగర్ - వి.శ్రీనివాస్ గౌడ్

జడ్చర్ల - సి.లక్ష్మారెడ్డి

దేవరకద్ర - ఆల్ల వెంకటేశ్వర రెడ్డి

మక్తల్ - చిట్టెం రామ్మోహన్ రెడ్డి

వనపర్తి - సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

గద్వాల్ - బండ్ల కృష్ణమోహన్

ఆలంపూర్- Dr అబ్రహం

నాగర్ కర్నూల్ - మర్రి జనార్దన్ రెడ్డి

అచ్చంపేట-గువ్వల బాలరాజు

కల్వకుర్తి- జైపాల్ యాదవ్

షాద్​ నగర్- అంజయ్య యాదవ్

కొల్లాపూర్ - బీరం హర్షవర్ధన్

(ఉమ్మడి నల్లగొండ)

దేవరకొండ - రమావత్ రవీంద్ర కుమార్

నాగార్జునసాగర్-భగత్

మిర్యాలగూడ - నల్లమోతు భాస్కర్ రావు

హుజూర్ నగర్ - శానంపుడి సైదిరెడ్డి

కోదాడ - బొల్లం మల్లయ్య యాదవ్

సూర్యాపేట - జి. జగదీష్ రెడ్డి

నల్గొండ - కంచర్ల భూపాల్ రెడ్డి

భువనగిరి - పైలా శేఖర్ రెడ్డి

నకిరేకల్ - చిరుమర్తి లింగయ్య

తుంగతుర్తి - గాదరి కిషోర్

ఆలేరు - గొంగడి సునీత

మునుగోడు - కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

(ఉమ్మడి వరంగల్)

జనగామ-

స్టేషన్ ఘన్​పూర్-కడియం శ్రీహరి

పాలకుర్తి - ఎర్రబెల్లి దయాకర్ రావు

డోర్నకల్-రెడ్యా నాయక్

మహబూబాబాద్-శంకర్ నాయక్

నర్సంపేట - పెద్ది సుదర్శన్ రెడ్డి

పరకాల - చల్లా ధర్మారెడ్డి

వరంగల్ పశ్చిమ - దాస్యం వినయ్ భాస్కర్

వరంగల్ ఈస్ట్-నరేందర్

వర్ధన్నపేట - ఆరూరి రమేష్

భూపాల్ పల్లి - గండ్ర వెంకటరమణారెడ్డి

ములుగు -నాగమణి

(ఉమ్మడి ఖమ్మం)

పినపాక - రేగా కాంతారావు

ఇల్లందు - బానోత్ హరిప్రియ

ఖమ్మం - పువ్వాడ అజయ్ కుమార్

పాలేరు-కందాల ఉపేందర్ రెడ్డి

మధిర -లింగాల కమల్ రాజు

వైరా-బానోత్ మదన్ లాల్

కొత్తగూడెం- వనమా వెంకటేశ్వరరావు

సత్తుపల్లి - సండ్ర వెంకటవీరయ్య

అశ్వారావుపేట - మెచ్చా నాగేశ్వర రావు

భద్రాచలం-తెల్లాం వెంకట్రావు

చోటు కోల్పోయిన సిట్టింగ్​లు వీరే..

సుభాష్ రెడ్డి - ఉప్పల్

రాజయ్య - స్టేషన్ ఘన్​పూర్

రాములు నాయక్ - వైరా

రేఖా నాయక్ -ఖానాపూర్

చెన్నమనేని రమేష్ - వేములవాడ

గంప గోవర్ధన్ -కామారెడ్డి

రాథోడ్ బాపురావు -బోధ్

విద్యాసాగర్ రావు - కోరుట్ల (ఆయన కుమారుడు సంజయ్​కు ఇచ్చారు)

ఆత్రం సక్కు - ఆసిఫాబాద్‌

BRS MLA Candidates First List 2023 : సిట్టింగ్ స్థానాల్లోకి కొత్తగా వచ్చిన అభ్యర్థులు వీరే..

సిట్టింగ్ స్థానాల్లో చోటు దక్కించుకున్న కొత్త అభ్యర్థులు..

కామారెడ్డిలో గంప గోవర్థన్ స్థానంలో.. కేసీఆర్ (రెండో స్థానం)

బోథ్‌లో రాథోడ్‌ బాపురావు స్థానంలో.. అనిల్‌ జాదవ్‌

స్టేషన్‌ ఘన్‌పూర్‌లో రాజయ్య స్థానంలో.. కడియం శ్రీహరి

కోరుట్లలో విద్యాసాగర్‌రావు స్థానంలో.. ఆయన కుమారుడు సంజయ్‌

వేములవాడలో చెన్నమనేని స్థానంలో.. చల్మెడ లక్ష్మీనరసింహారావు

ఖానాపూర్‌లో రేఖానాయక్‌ స్థానంలో.. భూక్యా జాన్సన్‌ రాథోడ్‌

ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు స్థానంలో.. కోవా లక్ష్మి

వైరాలో రాములునాయక్‌ స్థానంలో.. మదన్‌లాల్‌

ఉప్పల్‌లో బేతి సుభాష్‌రెడ్డి స్థానంలో.. బండారు లక్ష్మారెడ్డి

రెండు చోట్ల నుంచి కేసీఆర్..

KCR Contesting From Two Seats :

ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఈ దఫా రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. తాను ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ తోపాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా బరిలోకి దిగబోతున్నట్టు ప్రకటించారు.

అభ్యర్థులను ప్రకటించని స్థానాలు..

కేవలం నాలుగు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించలేదు (BRS MLA Candidates List 2023). ఇందులో.. జనగామ, గోషామహల్‌, నర్సాపూర్‌, నాంపల్లి నియోజకవర్గాలు ఉన్నాయి.

ఆనంద డోలికల్లో అభ్యర్థులు..

కేసీఆర్ ప్రకటించిన తొలి దశ జాబితాలోనే స్థానం సంపాదించిన అభ్యర్థులు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. ఇంటెలిజెన్స్ సర్వే మొదలు.. పలు నివేదికలు తెప్పించుకొని మరీ వడపోసిన తర్వాత.. అభ్యర్థులను ఖరారు చేశారు కేసీఆర్. మొన్నటి వరకూ సిట్టింగులను చాలా మందిని మారుస్తారని ప్రచారం సాగింది. అయితే.. అన్ని సమీకరణాలనూ లెక్కలోకి తీసుకున్న భారాస అధినేత.. మరీ తప్పదు అనుకున్న చోట్ల మాత్రమే సిట్టింగులకు మొండిచేయి చూపించారు. దీంతో.. గెలుపు గుర్రాల జాబితాలో తామూ చోటు సంపాదించినందుకు అభ్యర్థులంతా సంతోషం చేస్తున్నారు.

Last Updated : Aug 21, 2023, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details