మధ్యప్రదేశ్ ఇండోర్‌లో దారుణం జరిగింది. సోదరి భర్తను అత్యంత కిరాతకంగా పొడిచి హత్య చేశారు ఇద్దరు వ్యక్తులు. నిందితులను నగరంలోని రాజీవ్ బజార్‌కు చెందిన మహ్మద్ అయాజ్, వకార్గా పోలీసులు గుర్తించారు. ఇది పరువు హత్య అని భావిస్తున్నారు.
ఇదీ జరిగింది...
సమీర్, అల్మా ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడం వల్ల పారిపోయిన వారు రెండు నెలల కిందట పెళ్లి చేసుకున్నారు. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు ఆగ్రహించారు. ఆయాజ్, వకార్‌కు అల్మా ఒకే చెల్లిలు కావడం కారణంగా.. ఆమె చేసిన పనితో పరువు పోయిందని భావించారు. అయితే కొత్త దంపతులను ఇంటికి భోజనానికి రావాలని పిలిచారు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న అంతరాలు తొలిగిపోయినట్లు నమ్మబలికారు. ఇంటి పక్కన దుకాణం తెరిస్తే.. సోదరి దగ్గరగా ఉంటుందని ప్రేమను నటించారు. వారి మాటలు నిజమని నమ్మిన సమీర్, భార్య అల్మాతో కలిసి వెళ్లారు. దుకాణం చూపించే పేరుతో అన్నదమ్ములు ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చి కత్తితో విచక్షణారహితంగా పొడిచారు. ఇది గమనించిన స్థానికులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సమీర్ మరణించినట్లు వైద్యులు తెలిపారు.