Brother Raped Minor Sister in Maharashtra :15 ఏళ్ల వయసున్న సొంత చెల్లిపైనే పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు 18 ఏళ్ల యువకుడు. బాలిక గర్భం దాల్చడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ దారుణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భివాండి తాలూకాలోని కొంగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. బాధితురాలిపై గత కొద్ది నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు నిందితుడు. భయంతో దారుణం గురించి ఎవ్వరితోనూ చెప్పలేదు బాలిక. ఇటీవలే బాలికకు తీవ్ర కడుపు నొప్పి రావడం వల్ల ఆసుపత్రికి తీసుకెళ్లింది ఆమె తల్లి. అనంతరం వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. బాధితురాలు గర్భం దాల్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ నుంచి సోదరుడే పలుమార్లు తనపై అత్యాచారం చేసినట్లు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది బాలిక. బాధితురాలి తల్లి ఫిర్యాదు ఆధారంగా.. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.. అనంతరం అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
మహిళ సామూహిక అత్యాాచారం..
21 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం అత్యాచారం గురించి పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాస్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. పుష్పేంద్ర అనే వ్యక్తి.. ఆగస్టు 25న బాధితురాలిని బైక్‌పై ఎక్కుంచుకుని వెళ్లాడు. అనంతరం మరో ఇద్దరు అతడికి తోడై మహిళపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆగష్టు 27న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం వెల్లడించారు. నిందితుల వయస్సు 20 ఏళ్ల లోపే ఉంటుందని పోలీసులు తెలిపారు.