Brother Married His Sister: ఉత్తర్‌ప్రదేశ్ ఫిరోజాబాద్‌లో సొంత చెల్లినే వివాహం చేసుకున్నాడో అన్న. అదీ.. ముఖ్యమంత్రి సామూహిక వివాహాల్లో జరగడం గమనార్హం.
టుండ్ల బ్లాక్ పరిధిలో సీఎం సామూహిక వివాహల కార్యక్రమం జరిగింది. ఇందులో 51 జంటలు వివాహం చేసుకున్నాయి. వీరందరికీ పెళ్లి ఖర్చులను ప్రభుత్వమే భరించింది. గృహోపకరణాలు, దుస్తులను కానుకగా ఇచ్చింది. వివాహ ఫొటోలు స్థానికంగా ప్రచారం కాగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ అన్న, చెల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
UP Man Married His Sister: వివాహాలు నిర్వహించిన రాష్ట్ర సంక్షేమ శాఖ అధికారులు రంగంలోకి దిగి.. గ్రామస్థాయి అధికారులపై చర్యలు ప్రారంభించారు. దీనిపై వివరణ ఇవ్వాలని గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. తప్పు చేసినవారికి శిక్ష తప్పదని హెచ్చరించారు.