Broadcast Mediatainment Expo 2023 : భారతీయ చిత్ర పరిశ్రమకు హబ్‌గా నిలిచిన హైదరాబాద్, మీడియా, బ్రాడ్‌కాస్టింగ్ రంగంలోనూ ప్రపంచంతో పోటీ పడేందుకు సిద్ధమవుతోంది. రోజురోజుకు ఎదురవుతోన్న సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగుతోంది. మీడియా, బ్రాడ్‌కాస్టింగ్ రంగంలో విజన్ -2025 కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేసేందుకు పీడీఏ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా బ్రాడ్‌కాస్ట్ మీడియాటైన్‌మెంట్ ఎక్స్‌పోను (Broadcast Mediatainment Expo) ఏర్పాటు చేసింది.
సినీ, టెలివిజన్‌తోపాటు సాంకేతిక రంగాలకు సంబంధించిన ప్రముఖులు, ఈ ప్రదర్శనకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధు అంబట్, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రవి కొట్టార్కార (Film Federation of India President Ravi Kottarakara), ప్రసార భారతి అడిషనల్ డైరెక్టర్ సునీల్, ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. బ్రాడ్‌కాస్టింగ్‌లో ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కార మార్గాలపై చర్చించారు.
Broadcast Mediatainment Expo in Hyderabad :5జీ, 6జీ బ్రాడ్‌కాస్టింగ్‌లో అవకాశాలు, సవాళ్లు, ఓటీటీ స్ట్రీమింగ్, కంటెట్ రూపకల్పనపై అభిప్రాయాలను పంచుకున్నారు. భారతీయ సినిమాను ప్రపంచస్థాయిలో నిలబెట్టింది సాంకేతిక పరిజ్ఞానమేనన్న ప్రముఖులు, ఎప్పటికప్పుడు వాటిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు ఈ ప్రదర్శన దోహదపడుతుందన్నారు.
"ఇలాంటి ప్రదర్శనలు దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేయాలి. సినిమాలను బెస్ట్ క్వాలిటీతో ఏ విధంగా తీయాలి. ఇలాంటి ఎగ్జిబిషన్స్‌లకు హాజరు కావడం వల్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతీయ సినిమాలకు ఉపయోగించాలి. దర్శకుడు రాజమౌళి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. తెలుగు సినిమాల్లో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ఎక్కువగా ఉంది." - రవి కొట్టార్కార, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాఅధ్యక్షుడు
"ఒకప్పుడు ఫొటోగ్రాఫర్స్, కెమెరామెన్స్‌ను విదేశాలకు తీసుకెళ్లి శిక్షణ ఇచ్చేవారు. ఇప్పుడు వారే హైదరాబాద్‌కు వచ్చి చెబుతామనే ప్రయత్నం చేయడం గొప్ప విషయం. హైదరాబాద్ అనేది సినిమా ఇండ్రస్టీకి హబ్‌గా మారింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా సినిమా ఇండ్రస్టీని ప్రోత్సహించాలి." - సి.కళ్యాణ్, సినీ నిర్మాత