తెలంగాణ

telangana

By

Published : Mar 6, 2021, 4:23 PM IST

ETV Bharat / bharat

ఉత్తరాఖండ్​: ధౌలీగంగాపై కొత్త వంతెన ప్రారంభం

ఉత్తరాఖండ్​ జల ప్రళయంలో ధౌలీగంగాపై కొట్టుకుపోయిన వంతెన స్థానంలో 200 అడుగుల పొడవైన బెయిలీ వంతెనను సరిహద్దు రహదారుల సంస్థ ప్రారంభించింది. కేవలం 8 రోజుల్లోనే వంతెనను నిర్మించడం గమనార్హం.

BRO
కొత్త బెయిలీ వంతెనను ప్రారంభించిన బీఆర్​ఓ

ఉత్తరాఖండ్​లోని చమోలీ జిల్లాలో జల ప్రళయం సంభవించి ధౌలీగంగాపై ఉన్న వంతెనలు కొట్టుకుపోయాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో రైనీ గ్రామంలో 200 అడుగుల పొడవుగల బెయిలీ రహదారి వంతెనను యుద్ధ ప్రాతిపదికన నిర్మించి, ప్రారంభించింది సరిహద్దు రహదారుల నిర్మాణ సంస్థ (బీఆర్​ఓ).

ఫిబ్రవరి 7న ధౌలీగంగా, రిషిగంగా నదుల్లో వచ్చిన వరదలకు అంతకుముందున్న 90 అడుగుల పొడవున్న వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. దాంతో 8 రోజుల్లోనే 200 అడుగుల పొడవు గల వంతెన నిర్మించింది బీఆర్​ఓ.

కొత్త బెయిలీ వంతెనను ప్రారంభించిన బీఆర్​ఓ
కొత్త బెయిలీ వంతెనను ప్రారంభించిన బీఆర్​ఓ

ABOUT THE AUTHOR

...view details