దేశ సరిహద్దుల్లో రహదారులను నిర్మించే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) చరిత్రలో సరికొత్త ఘట్టం ఆవిష్కృతమైంది. భారత్-చైనా సరిహద్దుల్లో అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో రోడ్డు మార్గం నిర్మించే బీఆర్ఓలోని రహదారి నిర్మాణ సంస్థ ఆర్సీసీకు తొలి సారిగా ఓ మహిళ నేతృత్వం వహించనున్నారు. ఆర్సీసీ విభాగం అధిపతిగా వైశాలి ఎస్ హివాసే నియమితులయ్యారు. భారత్-చైనా సరిహద్దుల్లో పది వేల అడుగుల ఎత్తులో అత్యంత క్లిషమైన పర్వత సానువుల్లో ఆర్సీసీ రహదారులను నిర్మిస్తుంది.
భారత్- చైనా రోడ్డు ప్రాజెక్టు అధిపతిగా మహిళాధికారి - Road Construction Company
భారత్-చైనా సరిహద్దుల్లో అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో రోడ్డు మార్గం నిర్మించే బీఆర్ఓలోని రహదారి నిర్మాణ సంస్థ ఆర్సీసీకు తొలి సారిగా ఓ మహిళ నేతృత్వం వహించనున్నారు. ఆర్సీసీ విభాగం అధిపతిగా వైశాలి ఎస్ హివాసే నియమితులయ్యారు. వైశాలి ఇప్పటికే కార్గిల్‌లో విజయవంతంగా విధులు నిర్వర్తించారు.
వైశాలి ఎస్ హివాసే
మహారాష్ట్రలోని వార్దాకు చెందిన వైశాలి.. ఇప్పటికే కార్గిల్‌లో విజయవంతంగా విధులు నిర్వర్తించారు. క్లిష్టమైన బాధ్యతల్లో మహిళా అధికారుల నియామకం ద్వారా వారి సాధికారత దిశగా కొత్త ప్రయాణం ఆరంభిస్తున్నట్లు బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ తెలిపింది.
ఇదీ చదవండి :'దేశ ప్రజలందరికీ కేంద్రం ఉచిత టీకా ఇవ్వాలి'