తెలంగాణ

telangana

By

Published : Aug 16, 2021, 9:03 PM IST

ETV Bharat / bharat

'రిజర్వేషన్​లలో 50శాతం పరిమితిని ఎత్తేయండి'

రిజర్వేషన్​లపై ఉన్న 50శాతం పరిమితిని తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఎన్​సీపీ అధినేత శరద్ పవార్. ఆ దిశగా సుప్రీంకోర్టు ఆదేశాలను రద్దు చేసేందుకు చట్టం రూపొందించాలని కోరారు.

Sharad Pawar
రిజర్వేషన్

రిజర్వేషన్​లపై సుప్రీంకోర్టు విధించిన 50శాతం పరిమితిని తొలగించేందుకు చట్టం తీసుకురావాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు ఎన్​సీపీ అధినేత శరద్ పవార్. కోటా పరిమితిని పెంచేందుకు రాష్ట్రాలకు అనుమతించాలని కోరారు.

"కోర్టు తీర్పుల కన్నా రాజ్యాంగం పెద్దది. కోటా పరిమితిపై గానీ, దాని పెంపునకు గానీ రాజ్యాంగంలో ఎలాంటి అడ్డంకులూ లేవు. కాబట్టి, 50శాతం పరిమితిని తొలగించే విధంగా రాజ్యంగ సవరణ చేయాలని మోదీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ పరిమితిని పెంచేందుకు రాష్ట్రాలకు అనుమతివ్వాలని కోరుతున్నా."

- శరద్ పవార్, ఎన్​సీపీ అధినేత

ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 10శాతం రిజర్వేషన్​ కల్పించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 50శాతం పరిమితిని పొడిగించిందని పవార్ గుర్తుచేశారు. ఈ పరిమితిని తొలగిస్తే తప్పా మరాఠాలకు రిజర్వేషన్​లను పునరుద్ధరించలేమని చెప్పారు. కులాల ఆధారంగా జనగణన చేపట్టాలని కేంద్రాన్ని పవార్ కోరారు. రాజ్యసభలో గతవారం జరిగిన అవాంఛనీయ సంఘటనలపై స్పందిస్తూ పార్లమెంటులో మార్షల్స్​ను ఉపయోగించడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని అన్నారు.

ఇదీ చూడండి:వారికి మేలు చేయడానికి రిజర్వేషన్లే ఏకైక మార్గమా?

ABOUT THE AUTHOR

...view details