తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కూలిన వంతెన.. శిథిలాల కిందే జనం! - Bridge Collapse news

Bridge Collapse Cuttack: కటక్​లో వంతెన కూలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.

Bridge Collapse Cuttack
కూలిన వంతెన

By

Published : Mar 10, 2022, 4:24 AM IST

Bridge Collapse Cuttack: ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. కటక్​లో వంతెన కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

కూలిన వంతెన
కొనసాగుతున్న సహాయక చర్యలు

ప్రమాదవశాత్తు వంతెన ఓ భాగం కూలిపోగా.. దానిపై ఉన్నవారు శిథిలాల కింద చిక్కుకున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ఘటనపై స్పందించిన సీఎం నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రూ.3లక్షల పరిహారం ప్రకటించారు. ఘటనకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఘటనాస్థలంలో అంబులెన్స్​లు

ఇదీ చదవండి:రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. సర్పంచ్ దారుణ హత్య

ABOUT THE AUTHOR

...view details