మధ్యప్రదేశ్‌లో భోపాల్-నాగ్‌పుర్ జాతీయ రహదారిలో సుఖ్త్వా నదిపై ఉన్న వంతెన కూలిపోయింది. 40 అడుగుల ఎత్తైన ఈ వంతెనను 157 ఏళ్ల క్రితం బ్రిటీష్ కాలంలో నిర్మించారు. 138 చక్రాలు గల భారీ వాహనం వంతెనపై నుంచి వెళ్లడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా నలుగురు గాయపడ్డారు. భారీ యంత్రాన్ని తీసుకెళుతున్న వాహనం నదిలో పడిపోయింది. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
157 ఏళ్ల నాటి వంతెనపై 138 చక్రాల లారీ.. ఒక్కసారిగా కూలి... - Mp latest news in hindi
మధ్యప్రదేశ్‌లో బ్రిటీష్ కాలం నాటి వంతెన కూలిపోయింది. భోపాల్-నాగ్‌పుర్ జాతీయ రహదారిలో సుఖ్త్వా నదిపై గల 40 అడుగుల ఎత్తైన వంతెన.. 138 చక్రాల భారీ వాహనం ప్రయాణించడం వల్ల కుప్పకూలింది.
Bhopal Nagpur Highway bridge collapses
బ్రిటీష్ కాలం నాటి వంతెన కూలిపోవడం వల్ల ప్రస్తుతం హార్దా వైపునకు ట్రాఫిక్ మళ్లించామని అధికారులు తెలిపారు. ఈ వంతెనపై నుంచి రోజు సుమారు 5 వేల వాహనాలు ప్రయాణించేవని చెప్పారు. తోషిబా కంపెనీకి చెందిన ఈ వాహనం హైదరాబాద్ నుంచి ఇటార్సీకి వెళుతోంది.
ఇదీ చదవండి:తుక్కు నుంచి రాజ్‌దూత్ బైక్ తయారీ.. కొడుకు కోసం స్పెషల్‌గా..
Last Updated : Apr 10, 2022, 7:57 PM IST