తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెళ్లి ఊరేగింపులో 100 లగ్జరీ కార్లు.. ఎద్దుల బండి మీద వచ్చిన వరుడు

100 లగ్జరీ కార్లతో కుమారుడి పెళ్లి ఊరేగింపును ఏర్పాటు చేశారు ఓ బీజేపీ నేత. అయితే ఇన్ని కార్లు ఉన్నా పెళ్లికొడుకు మాత్రం ఎద్దుల బండిపైనే ఊరేగింపుగా వచ్చాడు. 2 కిలోమీటర్ల మేర ఊరేగింపు వాహనాలు కనిపించాయి. జనాలు ఈ ఊరేగింపును చూసేందుకు భారీగా తరలిచ్చారు. ఈ ఊరేగింపు ఎక్కడ జరిగిందంటే?

wedding procession Surat
ఎద్దుల బండిపై వరుడు

By

Published : Feb 25, 2023, 7:51 PM IST

పెళ్లి ఊరేగింపులో 100 లగ్జరీ కార్లు.. ఎద్దుల బండి మీద వచ్చిన వరుడు..

పెళ్లి ఊరేగింపులో ఐదు లేదా పది కార్లు చూసుంటాం. అయితే గుజరాత్..​ సూరత్​లోని ఓ పెళ్లి ఊరేగింపునకు ఏకంగా 100 కార్లు ఏర్పాటు చేశారు. అవి తక్కువ ధరవి కాదు.. అన్నీ లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ కార్లే. ఇన్ని కార్లు ఉంటే పెళ్లి కుమారుడు ఏ కారులో వచ్చాడని మీరు సందేహ పడుతున్నారా?.. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. వరుడు సింపుల్​గా ఎద్దుల బండిపై వచ్చాడు. కానీ అతడి ముందు, వెనుక ఖరీదైన వాహన శ్రేణి మాత్రం రెండు కిలోమీటర్ల విస్తరించి ఉంది. ఇలా ఎందుకు ఖరీదైన కార్లును ఊరేగింపులో వాడారో.. ఆ కథేంటో తెలుసుకుందామా.

సూరత్​కు చెందిన బీజేపీ నేత భరత్ వఘాశియా.. తన కుమారుడి ఊరేగింపును ఇలా వినూత్నంగా నిర్వహించారు. ఈ ఊరేగింపును చూసేందుకు జనాలు భారీగా గుమిగూడారు. రూ.కోట్ల విలువైన 100 లగ్జరీ కార్లు ఊరేగింపు వాహన శ్రేణిలో ఉండడమే అందుకు కారణం. ఈ వాహన శ్రేణి రెండు కిలోమీటర్లు ఉంది. అది చూసిన జనాలు ట్రాఫిక్ జామ్ అయ్యిందా అనేంతలా ఆశ్చర్యపోయారు. అయితే సౌరాష్ట్ర సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా తన కుమారుడి ఊరేగింపును చేశామని భరత్ వఘాశియా తెలిపారు. సౌరాష్ట్రలో పెళ్లి కుమారుడు ఎద్దుల బండి మీద మాత్రమే ఊరేగింపునకు వెళ్తాడని ఆయన అన్నారు.

ఎద్దుల బండిపై వరుడు
ఊరేగింపులో లగ్జరీ కార్లు

"సౌరాష్ట్రలో పెళ్లి ఊరేగింపు జరిగినప్పుడు వరుడు ఎద్దుల బండిలో మాత్రమే వెళ్తాడు. ఇది మా పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయం. నా కుమారుడిని ఖరీదైన కార్లంటే ఇష్టం. అందుకే ఖరీదైన ఊరేగింపులో ఖరీదైన వాహనాలను ఉపయోగించాం.. అలాగే సంప్రదాయాన్ని కొనసాగించాం. రూ. 50 లక్షల నుంచి రూ. 5 కోట్ల విలువైన కార్లను ఊరేగింపులో ఉపయోగించాం. నవ్​సారి, ముంబయి, వల్సాద్​ నుంచి నా కుమారుడి స్నేహితులు వచ్చారు. ప్రజలందరూ ఎప్పటికి గుర్తుండిపోయేలా నా కుమారుడి పెళ్లి ఊరేగింపు చెయ్యాలనుకున్నా."
--భరత్ వఘాశియా, బీజేపీ నేత

ఇలా భారీగా వాహనాలతో పెళ్లి ఊరేగింపులు జరపడం సినిమాల్లోనే చూస్తుంటాం. అయితే కుమారుడి ఇష్టాన్ని, సంప్రదాయాన్ని రెండు కొనసాగించారు వఘాశియా.

ఊరేగింపులో వరుస కట్టిన లగ్జరీ కార్లు
పెళ్లి ఊరేగింపులో లగ్జరీ కార్లు

ABOUT THE AUTHOR

...view details