తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కనకపు విలాసాలకు వధువు నో.. ఏడు పేద కుటుంబాల్లో జీవితకాలపు వెలుగులు - సాధారణంగా వివాహం చేసుకున్న కేరళ వధువు

Bride Wedding With No Jewellery:పెళ్లిని ఏ వధువైనా.. ఖరీదైన ఆభరణాలు, అందమైన దుస్తులు ధరించి జరుపుకుంటుంది. కానీ కేరళ కోజికోడ్​కు చెందిన పెళ్లికూతురు మాత్రం చాలా సాధారణంగా వివాహం చేసుకుని, మిగిలిన డబ్బులతో పేదలకు సహాయం చేసింది.

Kerala bride helping poor with wedding expenses
వివాహం

By

Published : Jan 20, 2022, 9:51 AM IST

Bride Wedding With No Jewellery: పెళ్లంటే.. ఖరీదైన బట్టలు, నగలతో మహిళలు ముస్తాబవుతారు. ఇక పెళ్లికూతురుకైతే ఒంటినిండా ఆభరణాలు ధరించే రోజులివి. కానీ కేరళకు చెందిన ఓ వధువు నగలు వేసుకోకుండానే వివాహం చేసుకుంది. ఆ డబ్బులతో పేదలకు సహాయం చేసింది.

సాధారణంగా వివాహం చేసుకున్న వధూవరులు

కోజికోడ్‌, మయపయ్యూర్​కు చెందిన అంత్రు-రంలా దంపతుల కుమార్తె షెహ్నా షెరి. కొట్టపల్లికి చెందిన మహమ్మద్​ షఫీతో ఆమె పెళ్లి నిశ్చయమైంది. షెహ్నా తన వివాహాన్ని సాధారణంగా జరుపుకుని మిగిలిన డబ్బులను పేదలకు సహాయం చేయాలనుకుంది. ఆమె నిర్ణయాన్ని తల్లిదండ్రులు, వరుడు కూడా అంగీకరించారు. దీంతో నిరాడంబరంగా పెళ్లితంతు ముగించారు.

Simple Bride Wedding: 21 సెంట్ల భూమిని నిరుపేదలైన నాలుగు కుటుంబాలకు ఇచ్చారు. దగ్గరిలోని డయాలసిస్​ సెంటర్​కు డబ్బులను దానంగా ఇచ్చారు. ఓ పేద వ్యక్తికి ఇంటిని నిర్మించారు. మరో వ్యక్తి ఆస్పత్రి చికిత్సకు డబ్బును సహాయం చేశారు. ఓ పేద అమ్మాయి వివాహ ఖర్చును భరించారు. వీరి నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.

ఇదీ చదవండి:ఇంటి మిద్దెపై ద్రాక్ష​ తోట.. ఆ రైతు చేసిన అద్భుతం

ABOUT THE AUTHOR

...view details