కొత్త జీవితానికి స్వాగతం పలికే పెళ్లి వేడుక(marriage ceremony) ప్రతి ఒక్కరికీ సుమధురమైన ఘట్టం. అయితే అనుకోని పరిస్థితుల్లో కొన్నిసార్లు వివాహ తంతు రసాభాసగా మారుతుంటుంది. ఇలాంటి ఘటనే తాజాగా నెట్టింట వైరల్గా మారింది.
ఒక్కసారిగా ఉద్రిక్తత..
బంధుమిత్రుల మధ్య ఓ వివాహ తంతు ఉత్సాహంగా సాగుతోంది. అయితే.. తనకు కాబోయే భర్త పొగాకు నములుతున్నాడని(bride chewing tobacco) వధువుకు తెలియడం వల్ల అక్కడి వాతావరణం వేడెక్కింది. దీనిని అసహ్యించుకున్న ఆమె.. వరుడితో పాటు ఎదురుగా ఉన్న వ్యక్తిని కొట్టింది. ఊహించని ఈ పరిణామానికి కంగుతిన్న వరుడు వెంటనే లేచి నిలుచుని నోటిలోని పొగాకును ఉమ్మేశాడు. వరుడిని కొడుతుండగా వధువును ఎవరూ ఆపకపోవడం గమనార్హం.