తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెళ్లి వేదికపై వధూవరులు కబడ్డీ కబడ్డీ! - వధువు కబడ్డీ ఆట వైరల్ వీడియో

ఓ వివాహ వేడుకలో వధువు చేసిన హంగామా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. పెళ్లిపీటల ఆమె కబడ్డీ ఆడుతుందా అనిపించేంతలా జరిగిన ఈ సన్నివేశం తెగ సందడి చేస్తోంది.

Bride runs around the stage during marriage ceremony
నూతన వధువు కబడ్డీ ఆట.. వరుడి రియాక్షన్ నైస్!

By

Published : Jul 28, 2021, 3:05 PM IST

పెళ్లి వేడుకలో జరిగే సరదా సన్నివేశాలు జీవితాంతం తీపిజ్ఞాపకాలుగా గుర్తుండిపోతాయి. ఇలానే తన వివాహ వేడుక మరింత మధురంగా ఉండాలని భావించిందో ఏమో.. ఓ వధువు దండ వేయించుకునే సమయంలో వరుడిని ఆటపట్టిస్తూ సందడి చేసింది. ఈ సరదా సన్నివేశం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఇదీ సందర్భం..

ఓ వివాహ వేడుకలో వధూవరులు దండలు మార్చుకునే సందర్భం నవ్వులు పూయించింది. వరుడికి దండ వేసిన వధువు.. తనకు మాల వేసేందుకు సిద్ధమైన వరుడికి దొరక్కుండా తప్పించుకుంటూ నవ్వులు పూయించింది. భిన్నంగా సాగిన ఈ తంతు ఆద్యంతం ఆకట్టుకుంది.

వరుడి మెడలో మాల వేసేందుకు సిద్ధమైన వధువు
వరుడి మెడలో మాల వేస్తున్న వధువు
వరుడు మాల వేసేందుకు ప్రయత్నించగా తప్పించుకుంటున్న వధువు

మనీష్ మిశ్రా అనే వ్యక్తి ట్విట్టర్​లో షేర్ చేసిన ఈ వీడియోలో వధువు చమత్కారానికి తోడు.. వరుడి సరదా స్పందన నెటిజన్లను ఆకట్టుకుంటోంది. చివరకు స్నేహితుల సహాయంతో వరమాల వేయడం వీడియోలో గమనించవచ్చు.

పూలదండలతో వధూవరులు

వధువు చేష్టలను చూసిన నెటిజన్లు.. కబడ్డీ ఆడాలని ముందే ఫిక్స్ అయినట్లుంది కదా! అని వ్యాఖ్యానించారు. 'భాగ్ మిల్కా భాగ్' అంటూ మరొకరు చమత్కరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details