తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సొంతంగా కారు నడుపుతూ పెళ్లి మండపానికి వధువు - కారు నడిపిన వధువు

సొంతంగా కారు నడుపుతూ పెళ్లి మండపానికి చేరుకుందో వధువు. ఉత్తరాఖండ్​లోని రూడ్కీలో ఈ ఘటన జరిగింది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా వధువు ఇలా సొంతంగా డ్రైవ్​ చేసుకుంటూ రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

bride driving car roorkee
సొంతంగా కారు నడుపుతూ పెళ్లి మండపానికి వధువు

By

Published : Nov 30, 2021, 12:13 PM IST

కారు డ్రైవ్ చేసుకుంటూ మండపానికి చేరుకున్న వధువు

పెళ్లిలో వధూవరులను మండపానికి తీసుకొచ్చేందుకు బారాత్​ పెట్టి ఎంతో ఆర్భాటంగా ఊరేగింపు నిర్వహిస్తారు. ఉత్తరాఖండ్​లోని రూడ్కీలో ఇదే విధంగా వరుడు సహా అతని తరపు వారు మండపానికి చేరుకొని వధువు కోసం ఎదురుచూస్తున్నారు. కానీ వధువు చేసిన పనికి ఆశ్చర్యపోవడం అక్కడి వారి వంతైంది. పెళ్లికి సిద్ధమైన పూనమ్​ తవార్ ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా మండపానికి​ సొంతంగా కారు డ్రైవ్​ చేసుకుంటూ వచ్చేసింది.

వధువు పూనమ్ తవార్

ఇలా ఎందుకంటే..

గతేడాది తండ్రి మృతిచెందడం వల్ల ఇంటి బాధ్యతలు అన్నీ పూనమ్​ తవార్​ మీదనే పడ్డాయి. అప్పటినుంచి తన పని తాను చేసుకోవడం ఆమెకు అలవాటైంది. ఎవరిపైనా ఆధారపడకుండా బతకాలి అన్న తండ్రి మాటలే తనకు స్ఫూర్తి అంటోంది పెళ్లికూతురు. అందుకే దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మండపానికి సొంతంగా కారు నడుపుకుంటూ వెళ్లిపోయింది.

పెళ్లి కూతురు ఇలా మండపానికి కారులో డ్రైవ్​ చేసుకుంటూ రావడం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశమైంది.

ఇదీ చూడండి :Omicron India: ఒమిక్రాన్​ భయాలు- ఆఫ్రికా నుంచి వచ్చిన 100 మంది అదృశ్యం!

ABOUT THE AUTHOR

...view details