Bride canceled wedding for dowry in medchal : పెళ్లి ఆగిపోయిందంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో వరకట్నం ఒకటి. కట్నం సరిపోలేదని అబ్బాయి పెళ్లి ఆపేసిన సంఘటనలు ఇప్పటికే మనం చాలా చూశాం. కానీ ఓ పెళ్లి మాత్రం ఊహించని విధంగా ఆగిపోయింది. మరో గంటలో పెళ్లి జరగనుండగా.. తనకు ఎదురుకట్నం సరిపోలేదని ఓ వధువు పెళ్లికి నో చెప్పింది. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఓసారి మీరూ చదివేయండి.
Bride canceled wedding for dowry in ghatkesar : వివాహానికి వచ్చిన బంధువులతో ఆ ఫంక్షన్ హాల్ అంతా కోలాహలంగా మారింది. ఇంతలోనే వరుడికి వధువు షాక్ ఇచ్చింది. నాకు పెళ్లి వద్దంటూ తెగేసి చెప్పింది. ప్రేమ వ్యవహారం, అదనపు వరకట్నం కోసం వరుడి తరఫున వాళ్లు ఇబ్బంది వధువు తరుపు వారిని బలవంతపెట్టడం వంటి కారణాల వల్ల పెళ్లిళ్లు మధ్యలోనే ఆగిపోవడం వంటి సంఘటనలు నిత్యం ఏదో చోట బయటకు వస్తూనే ఉంటాయి. కానీ తాజాగా వధువు తనకు వరుడి తరఫున వాళ్లు ఇచ్చిన వరకట్నం సరిపోలేదని పెళ్లినే రద్దు చేసింది. ఈ పంచాయతీ పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువకుడికి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువతితో వివాహం కుదిరింది. అమ్మాయికి ఎదురు కట్నం కింద రెండు లక్షల రూపాయలు ఇచ్చేందుకు పెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల మధ్య అంగీకారం జరిగింది. గురువారం ఈ నెల 9న రాత్రి 7 గంటల 21 నిమిషాలకు వివాహం ముహూర్తం నిశ్చయించారు. ఘట్కేసర్లోని ఓ ఫంక్షన్ హాల్లో వివాహం జరుగుతుందని అబ్బాయి కుటుంబ సభ్యులు ఆహ్వాన పత్రిక బంధుమిత్రులకు పంపిణీ చేశారు. ముహూర్తానికి ముందే అబ్బాయి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఆ ఫంక్షన్ హాల్‌కు చేరుకున్నారు.