తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెళ్లైన మరుసటి రోజే వధూవరులు మృతి.. అనుమానాస్పద స్థితిలో మంచంపై.. - లవ్ జిహాద్ కేసు

పెళ్లైన మరుసటి రోజే అనుమానాస్పద స్థితిలో మరణించారు నవ దంపతులు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బహ్రైచ్​ జిల్లాలో జరిగింది. బిహార్​ పట్నాలో జరిగిన మరో ఘటనలో 4 నెలల చిన్నారిని కాల్చి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు.

Bride and groom death in Bahraich
Bride and groom death in Bahraich

By

Published : Jun 1, 2023, 5:56 PM IST

Updated : Jun 1, 2023, 7:15 PM IST

భోజనం చేసి నిద్రపోయేందుకు గదిలోకి వెళ్లిన నవ దంపతులు తెల్లారేసరికి విగతజీవులుగా మారిపోయారు. పెళ్లైన మరుసటి రోజే వధూవరులు మరణించడం వల్ల ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బహ్రైచ్​ జిల్లాలో జరిగింది.

ఇదీ జరిగింది
కౌసర్​గంజ్​ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోఢాహియా గ్రామానికి చెందిన ప్రతాప్​కు గుల్లన్​పుర్వ గ్రామ యువతి పుష్పతో మే 30న వివాహం జరిగింది. ఆ తర్వాత మే 31న వధువుతో కలిసి గ్రామానికి వచ్చాడు వరుడు ప్రతాప్​. బుధవారం రాత్రి భోజనం చేసిన తర్వాత గదిలోకి వెళ్లి నిద్రపోయారు. తెల్లారినా సరే వధూవరులు నిద్ర లేవకపోవడం వల్ల కుటుంబసభ్యులు తలుపు తట్టారు. ఎంతసేపు తట్టినా తలుపు తీయకపోవడం వల్ల అనుమానించి కుటుంబసభ్యులు కిటీకీలోంచి చూడగా ఇద్దరూ మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే తలుపులు పగలకొట్టి వెళ్లి చూస్తే విగతజీవులై కనిపించారు.

కుటుంబసభ్యుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్​మార్టమ్ పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని.. శవపరీక్షల నివేదికలు వచ్చిన తర్వాతే మరణానికి గల కారణం తెలుస్తుందని పోలీసులు చెప్పారు. గదిలో సమోసాలు, కూల్​డ్రింక్స్​ లభ్యమయ్యాయని తెలిపారు.

4 నెలల చిన్నారి హత్య
4 నెలల చిన్నారిని కాల్చి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ దారుణ ఘటన బుధవారం రాత్రి బిహార్​ రాజధాని పట్నాలో జరిగింది. అయితే, తమ బంధువే ఈ కిరాతకానికి పాల్పడ్డాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్​మార్టమ్ పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

రేప్ చేసి మతం మార్పించే యత్నం
గుజరాత్ వడోదరలో లవ్​ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి.. ఆమెను మతం మార్పించడానికి ప్రయత్నించాడు ఓ వ్యక్తి.
నవపురా ప్రాంతంలో నివసించే మహ్మద్​ హుస్సేన్​.. అదే ప్రాంతంలో ఉండే ఓ మహిళను గత కొంత కాలంగా వేధిస్తున్నాడు. బాధితురాలి భర్త వేరే ప్రాంతంలో ఉంటున్నాడు. దీనిని అవకాశంగా చేసుకున్న హుస్సేన్​.. ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటపెడితే.. ఆమె కుమారుడిని చంపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత మహిళను దర్గాకు తీసుకువెళ్లి.. ఆమె ఆభరణాలను తీసేసి, మతం మార్పించే ప్రయత్నం చేశాడు. అతడి నుంచి తప్పించుకున్న బాధితురాలు నవపురా పోలీస్ స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు మహ్మాద్ హుస్సేన్​ను​ అరెస్ట్ చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

స్నేహం చేయట్లేదని హత్యాయత్నం
తనతో స్నేహం చేయడం లేదన్న కోపంతో యువతిని చంపేందుకు ప్రయత్నించాడు ఓ యువకుడు. ఈ ఘటన ఝార్ఖండ్​లోని రామ్​గఢ్​లో జరిగింది.
తనతో స్నేహం చేయాలంటూ గత కొంతకాలంగా యువతిని వేధిస్తున్నాడు ఓ యువకుడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడం వల్ల బుధవారం రాత్రి యువతి ఇంట్లోకి చొరబడి ఆమెను వేధింపులకు గురిచేశాడు. ఆమె ప్రతిఘటించడం వల్ల కత్తితో దాడి చేసి.. చంపేందుకు ప్రయత్నించాడు. అతడి నుంచి తప్పించుకున్న బాధితురాలు రోడ్డుపైకి పరిగెత్తుకు వచ్చి కాపాడమని ప్రాథేయపడింది. స్థానికులు ఆమెను రక్షించి.. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నిందితుడు ఓ కేసులో శిక్ష అనుభవించి ఇటీవలె బయటకు వచ్చాడని చెప్పారు.

ఇవీ చదవండి :దిల్లీలో 'కేరళ స్టోరీ'.. ప్రేమగా దగ్గరై రేప్.. మతం మార్చి వివాహం.. 11 ఏళ్ల తర్వాత..

మూడోకాన్పులోనూ కూతురు.. శిశువును నేలకేసి కొట్టిన తండ్రి.. పెళ్లి రోజే గుండెపోటుతో వరుడు మృతి

Last Updated : Jun 1, 2023, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details