అవినీతి ఆరోపణల కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ముంబయిలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని పోలీసులకు దేశ్‌ముఖ్ ఆదేశాలు జారీ చేశారని ముంబయి మాజీ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది.
విచారణలో భాగంగా.. దేశ్‌ముఖ్‌పై అధికారికంగా దర్యాప్తు చేసేందుకు తగిన ఆధారాలు లభించాలని అధికారులు చెప్పారు. దేశ్‌ముఖ్‌పై రెగ్యులర్ కేసు నమోదు చేయడం సహా, మరికొందరిపై అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు వివరించారు. కేసు నమోదు తర్వాత దేశ్‌ముఖ్‌కు చెందిన పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.