పాల కోసమని బయటకు వచ్చిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు అతను చనిపోయినట్లు నిర్ధరించారు. ఇదంతా గురువారం రాత్రి జరిగిన విషయం. శుక్రవారం ఉదయం అతని పోస్ట్‌మార్టంకు సిద్ధం చేస్తున్న పోలీసులు విస్తుపోయారు. చనిపోయాడనుకున్న వ్యక్తి బతికాడు. ఈ వింత ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మోర్దాబాద్ జిల్లాలో జరిగింది.
మోర్దాబాద్ కార్పొరేషన్లో పనిచేస్తున్న శ్రీకేశ్ను రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొంది. బంధువులు హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించగా అతను అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధరించారు. మరుసటి రోజు శుక్రవారం ఉదయం 11 గంటలకు పోస్ట్‌మార్టం చేసేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తుండగా శ్రీకేశ్ శ్వాసతీసుకోవడం గుర్తించారు. వైద్యులకు సమాచారం అందించగా శ్రీకేశ్ బతికే ఉన్నట్లు నిర్ధరించారు. అనంతరం ఐసీయూకి తరలించారు.