తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బ్రేకప్ చెప్పినంత మాత్రాన.. ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదు.. - Bombay high court verdict on breakup

Bombay high court: ఓ కేసులో కీలక తీర్పునిచ్చింది ముంబయి హైకోర్టు. బ్రేకప్ చెప్పినంత మాత్రాన ఒకరిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదని స్పష్టం చేసింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి లవర్ మోసం చేసిందని బలవన్మరణానికి పాల్పడగా.. కేసు విచారించి ఈ మేరకు తీర్పు వెలువరించింది.

Breaking up does not mean motivating for suicide
బ్రేకప్ చెబితే ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదు.. కోర్టు సంచలన తీర్పు

By

Published : Jun 11, 2022, 9:57 PM IST

Updated : Jun 12, 2022, 9:04 AM IST

Breakup Suicide: ఒకరికి బ్రేకప్​ చెప్పినంత మాత్రాన అది ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదని కీలక తీర్పు వెలువరించింది ముంబయి హైకోర్టు. పెళ్లైన ఓ వ్యక్తి తనను లవర్​ మోసం చేసిందని ఆత్మహత్య చేసుకోగా.. అతని తల్లి ఆమెపై కేసు పెట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న నాగ్​పుర్​ బెంచ్ ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. బ్రేకప్ చెప్పినంత మాత్రాన ఆత్మహత్యకు కారణం ఆమె కాదని తెలిపింది.

బుల్ధానా జిల్లాకు చెందిన జీవన్​కు మనీషా(పేరు మార్చాం) అనే యువతితో కొద్ది సంవత్సరాలుగా వివాహేతర సంబంధం ఉంది. ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే జీవన్ తన భార్య నుంచి విడాకులు తీసుకోకుండానే మనీషాతో సంబంధం కొనసాగించాడు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య అనేక సార్లు గొడవ జరిగింది. భార్యకు విడాకులిస్తే పెళ్లికి అభ్యంతరం లేదని మనీషా జీవన్​కు చెప్పింది. చివరకు జీవన్ మొదటి భార్యకు విడాకులిచ్చాడు. మనీషాతో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఆమె కూడా అందుకు ఓకే చెప్పింది. అయితే చివరకు మనీషా మనసు మార్చుకుని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలిసి జీర్ణించుకోలేకపోయిన జీవన్​ ఆత్మహత్య చేసుకున్నాడు.

మనీషా మోసం చేయడం వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని జీవన్​ తల్లి కోర్టును ఆశ్రయించింది. భార్య నుంచి విడిపోయి అప్పటికే తీవ్ర ఒత్తిడిలో తన కొడుకు.. మనీషా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని తెలిసి కుంగిపోయి బలవన్మరణానికి పాల్పడ్డాడని 2021 మే 7న పోలీసులు ఫిర్యాదు చేసింది. మనీషే జీవన్​ను ఆత్మహత్యకు ఉసిగొల్పిందని ఆరోపించింది. ఈ కేసులో వాదోపవాదనలు విన్న ముంబయి హైకోర్టు నాగ్​పుర్ బెంచ్ ధర్మాసనం.. చారిత్రక తీర్పు వెలువరించింది. మనీషా పథకం రచించి జీవన్​ ఆత్మహత్య చేసుకునేలా చేయలేదని పేర్కొంది. జీవన్​ను పెళ్లి చేసుకుంటానని గతంలో చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేసింది. ఈ విషయంలో ఆమెను నిందించలేమని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:భార్య కోసం.. జైలులో 50 రోజులుగా నిరాహార దీక్ష

Last Updated : Jun 12, 2022, 9:04 AM IST

ABOUT THE AUTHOR

...view details