Blast in Udhampur: జమ్ముకశ్మీర్‌లోని ఉదమ్‌పుర్‌లో రోడ్డు పక్కన భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. మరో 15 మందికి గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. పేలుడు జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.
భద్రతా దళాలు బ్లాస్ట్ జరిగిన ప్రాంతాన్ని వారి అధీనంలోకి తీసుకున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
మరో బ్లాస్ట్...
బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో మరో పేలుడు జరిగింది. ఈ ఘటనలో కూడా ఒకరు చనిపోగా చాలా మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఫుల్వారియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బతువా బజార్‌లో జరిగింది.