తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గవర్నర్​ను వదిలివెళ్లిన ఎయిర్​ఏషియా ఫ్లైట్​.. గంటన్నర తర్వాత మరో విమానంలో హైదరాబాద్​కు.. - కర్ణాటక గవర్నర్ లేటెస్ట్ న్యూస్

AirAsia Flight Takes Off Without Karnataka Governor : దేశీయ విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా సిబ్బంది.. ప్రొటోకాల్‌ ఉల్లంఘనకు పాల్పడ్డారు. కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ను ఎయిర్​పోర్ట్​లోని వదిలేసి వెళ్లారు.

karnataka governor airasia flight
karnataka governor airasia flight

By

Published : Jul 28, 2023, 3:37 PM IST

Karnataka Governor Airasia Flight : కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ను ఎయిర్​పోర్ట్​లోని వదిలేసి వెళ్లారు ఎయిర్​ఏషియా సిబ్బంది. ఎయిర్‌పోర్టు లాంజ్​లో ఎదురుచూస్తున్న ఆయనను.. వదిలేసి విమానాన్ని టేకాఫ్‌ చేశారు. ఈ ఘటన బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ హైదరాబాద్‌కు వెళ్లేందుకు గురువారం మధ్యాహ్నం బెంగళూరు విమానాశ్రాయానికి వెళ్లారు. తర్వాత ఆయన లగేజీని కూడా విమానంలోఎక్కించారు ఎయిర్‌ఏషియా సిబ్బంది. అయితే వీఐపీ లాంజ్​లో ఉన్న గహ్లోత్‌ అక్కడి నుంచి టర్మినల్‌ 2కు చేరుకునేలోపే విమానం హైదారాబాద్‌కు టేకాఫ్‌ అయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. గవర్నర్‌ టర్మినల్‌ వద్ద ఉన్న బోర్డింగ్‌ గేట్‌కు ఆలస్యంగా చేరుకోవడం వల్లే విమానం వెళ్లిపోయిందని ఎయిర్​ఏషియా వర్గాలు చెప్పాయి.

అయితే, ఎయిర్‌ఏషియా సిబ్బంది నిర్వాకంపై గవర్నర్‌ ప్రొటోకాల్‌ అధికారులు విమానాశ్రయ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. ఈ ఘటన కారణంగా గహ్లోత్‌ 90 నిమిషాల తర్వాత మరో విమానంలో హైదరాబాద్‌కు వెళ్లిన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఎయిర్‌ఏషియా క్షమాపణలు..
మరోవైపు, ఈ ఘటనపై స్పందించిన ఎయిర్‌ఏషియా ఓ ప్రకటనను విడుదల చేసింది. 'గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌కు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నాం. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. వృత్తిపరంగా అత్యున్నత ప్రమాణాలు, ప్రొటోకాల్‌కు కట్టుబడి ఉండటానికే మేం ప్రాధాన్యమిస్తాం. గవర్నర్‌ కార్యాలయంతో మా సంబంధాలను మేం ఎల్లప్పుడూ గౌరవిస్తాం. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం' అని ఎయిర్‌ఏషియా తమ ప్రకటనలో చెప్పింది.

3 ఎంపీలు సహా 100 మంది ప్రయాణికులను వదిలిన పైలట్​
మూడు రోజుల కిందే.. ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఎయిర్​ఇండియా విమానం టేకాఫ్ చేసేందుకు పైలట్ నిరాకరించడం వల్ల బీజేపీ ఎంపీలు సహా వంద మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ విమానాశ్రయం నుంచి దిల్లీకి బయలుదేరాల్సిన విమానంలో ఈ సమస్య తలెత్తింది. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది.

ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో రాజ్‌కోట్ విమానాశ్రయం నుంచి ఎయిర్​ఇండియా విమానం దిల్లీకి బయలుదేరాల్సి ఉంది. అయితే విమాన పైలట్​ టేకాఫ్ చేసేందుకు నిరాకరించారు. డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిబంధనల ప్రకారం.. తన పనిగంటలకు మించి పనిచేయడం వల్ల విమానాన్ని టేకాఫ్ చేసేందుకు పైలట్ ససేమిరా అన్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ వందమంది ప్రయాణికుల్లో జామ్‌నగర్ ఎంపీ పూనమ్ మాదమ్‌, రాజ్‌కోట్‌ ఎంపీ మోహన్‌ కుందరియా, రాజ్యసభ ఎంపీ కేసరీదేవ్‌ సిన్హ్‌ ఝాలా కూడా ఉన్నారు.

ఇవీ చదవండి :విమానంలో 'హైజాక్​' అంటూ ఫోన్​లో ముచ్చట్లు.. నిమిషాల్లో ప్రయాణికుడి అరెస్ట్​!

సోనియా, రాహుల్​ వెళ్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. విపక్ష మీటింగ్​ వెళ్లి వస్తుండగా..

ABOUT THE AUTHOR

...view details