అంధులైన న్యాయవాదుల కోసం మద్రాస్ హైకోర్టు(Madras high court) ప్రత్యేక సదుపాయాన్ని(Braille printer) అందుబాటులోకి తెచ్చింది. బ్రెయిలీ లిపిలో కోర్టు ఉత్తర్వుల కాపీల్ని అందించేందుకు వీలుగా ప్రత్యేక ప్రింటర్‌ను(Braille printer) సోమవారం నుంచి ప్రవేశపెట్టింది. ఈ మేరకు కోర్టు రిజిస్ట్రార్ జనరల్ పి.ధనబల్ ఓ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఆ హైకోర్టులో బ్రెయిలీ లిపిలోనూ ఉత్తర్వులు.. ప్రత్యేక ప్రింటర్ ఏర్పాటు - braille printer at Madras high court
బ్రెయిలీ లిపిలో కోర్టు ఉత్తర్వుల కాపీలను అందించేందుకు వీలుగా ప్రత్యేక ప్రింటర్‌ను(Braille printer) మద్రాస్ హైకోర్టు ఏర్పాటు చేసింది. అంధులైన న్యాయవాదులకు ఉపయోగపడేలా.. సోమవారం నుంచి దీన్ని అందుబాటులోకి తెచ్చింది.
బ్రెయిలీ ప్రింటర్
దివ్యాంగుల హక్కుల చట్టం-2016 ప్రకారం బ్రెయిలీ ప్రింటర్‌ను(Braille printer) ఏర్పాటు చేసినట్లు మద్రాస్ హైకోర్టు(Madras high court) తెలిపింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలకు సంబంధించిన ఉత్తర్వులు కూడా బ్రెయిలీ లిపిలో అందుబాటులో ఉంచుతామని చెప్పింది. ఈ ప్రింటర్‌ను ప్రిన్సిపల్ జడ్జి సీటు దగ్గర ఉంచినట్లు పేర్కొంది.
ఇదీ చూడండి:'కోర్టులంటే గౌరవం లేదా! మరీ ఇంత అహంకారమా?'