తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రియురాలిని కత్తితో పొడిచి.. ప్రియుడి ఆత్మహత్యాయత్నం - boyfriend murdered his girlfriend

ప్రియురాలిని కత్తితో పొడిచి.. ప్రియుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తమిళనాడులో (Tambaram news) జరిగింది. ఈ ఘటనలో యువతి మృతి చెందగా.. నిందితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Boyfriend stabbed his girlfriend
ప్రియురాలిని కత్తితో పొడిచిన ప్రియుడు

By

Published : Sep 24, 2021, 1:29 PM IST

తమిళనాడు- చెన్నైలోని తంబారంలో(Tambaram news) దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయిని కత్తితో పొడిచి.. తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ ఘటనలో యువతి మృతి చెందగా.. నిందితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అసలేమైంది?

క్రోంపెట్​లోని రాధానగర్​కు చెందిన 25 ఏళ్ల యువతి.. తంబారంలోని(Tambaram news) ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతుంది. రోజూలానే కాలేజీకి వెళ్లిన ఆమె.. తన ప్రియుడితో కలిసి బయటకు వెళ్లింది. ఈ క్రమంలోనే కాలేజీ సమీపంలోని రైల్వేస్టేషన్​ ముందు ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన అతడు.. కత్తితో యువతి గొంతులో పొడిచాడు. అనంతరం తన మెడ కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:జవాన్ల మధ్య భీకర కాల్పులు- ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details