తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముగ్గురు పిల్లల తల్లితో సంబంధం.. పెళ్లి చేసుకోమందని 35సార్లు కత్తితో పొడిచి హత్య - ప్రియురాలిని చంపిన వ్యక్తి

తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్న ఓ వివాహితను 35 సార్లు కత్తితో పొడిచి పాశవికంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. నిందితుడికి అతడి స్నేహితుడు సాయం చేశాడు. మృతురాలు వివాహిత అని.. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది.

lover killed girlfriend
ప్రియురాలిని చంపిన ప్రియుడు

By

Published : Jan 5, 2023, 4:04 PM IST

మహారాష్ట్రలోని ఠాణెలో ఘోరం జరిగింది. పెళ్లి చేసుకోమని బలవంత పెట్టడం వల్ల ప్రియురాలిని 35 సార్లు కత్తితో పొడిచి పాశవికంగా హత్య చేశాడు ఓ ప్రియుడు. ఈ కేసును కల్యాణ్ పోలీసులు ఛేదించారు. నిందితులు జయరామ్ ఉత్తరేశ్వర్​, అతడికి సహకరించిన సూరజ్ గోలూను అరెస్ట్ చేశారు. మృతురాలిని రూపాంజలి శంభాజీ జాదవ్​గా పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పుణెకు చెందిన రూపాంజలి అనే వివాహితకు జయరామ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అనంతరం వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. రూపాంజలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయినా జయరామ్​ను పెళ్లి చేసుకోవాలని రూపాంజలి నిశ్చయించుకుంది. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని జయరామ్​ను బలవంత పెట్టింది. దీంతో నిందితుడు జయరామ్.. రూపాంజలిని హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు.

కల్యాణ్ సమీపంలో గౌలి అడవిలో తనకు బంగారం దొరికిందని రూపాంజలిని తీసుకెళ్లాడు జయరామ్​. ఆ తర్వాత జయరామ్ అతడి స్నేహితుడు సూరజ్​తో కలిసి పదునైన కత్తితో 35 సార్లు రూపాంజలిని పొడిచి హత్య చేశాడు. అనంతరం నిందితులిద్దరూ అంజలి మృతదేహాన్ని గౌలి అడవుల్లో వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు.

నిందితులను అరెస్ట్ చేసిన కల్యాణ్ పోలీసులు

గతేడాది డిసెంబర్ 27న అడవిలో మహిళ మృతదేహం కనిపించిందని పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మహిళ మృతదేహం వద్ద పోలీసులకు ఆధార్ కార్డు లభించింది. సోషల్ మీడియా యాప్ ఇన్​స్టాగ్రామ్​ ద్వారా మృతురాలి బంధువులను గుర్తించారు. వెంటనే నిందితులను పట్టుకోవడం కోసం చకన్​, పుణె, బీడ్​ వెళ్లాయి పోలీసు బృందాలు. 48 గంటల వ్యవధిలోనే నిందితులను కల్యాణ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details