తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిన్నారికి పాముకాటు.. చికిత్స కోసం 10కి.మీ నడక.. హోటల్​లో జంట మృతదేహాలు! - వ్యాాాపారవేత్తను చంపిన వెయిటర్

తమిళనాడులో విషాదకర ఘటన జరిగింది. పాముకాటుకు గురైన బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు.. 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లారు కుటుంబ సభ్యులు. అయినా.. చిన్నారి ప్రాణాలు నిలవలేదు. చివరకు మృతదేహాన్ని మోసుకుంటూ నడుచుకుంటూనే ఇంటికి చేరుకున్నారు. మరోవైపు, ఓ ప్రేమజంట హోటల్​లో విగతజీవులుగా పడి ఉండటం ఉత్తర్​ప్రదేశ్​లోని గాజియాబాద్​లో సంచలనమైంది.

boyfriend kills girlfriend
boyfriend kills girlfriend

By

Published : May 29, 2023, 7:47 AM IST

Updated : May 30, 2023, 10:29 AM IST

తమిళనాడులోని వెల్లూరులో హృదయవిదారక ఘటన జరిగింది. రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల ఏడాదిన్నర చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పాముకాటుకు గురైన బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ఆమె కుటుంబ సభ్యులు 10 కిలోమీటర్లు నడిచుకుంటూ వెళ్లారు. అయినా.. ఆమె ప్రాణాలను నిలబెట్టుకోలేకపోయారు. కుటుంబ సభ్యులు అంత బాధలోనూ.. ప్రాణాలు కోల్పోయిన బాలిక మృతదేహంతో నడుచుకుంటూనే ఇంటికి రావడం స్థానికంగా మౌలిక వసతుల లేమికి అద్దం పడుతోంది.

అతిమరతు కొల్లాయి అనే గ్రామంలో విజీ, అతడి భార్య జీవిస్తున్నారు. ఈ దంపతులకు ఏడాదిన్నర వయసున్న దనుష్క అనే పాప ఉంది. శనివారం రాత్రి దనుష్కతో కలిసి ఆమె తల్లిదండ్రులు ఇంటి బయట నిద్రిస్తున్నారు. ఆ సమయంలో ఓ పాము.. నిద్రిస్తున్న చిన్నారిని కాటేసింది. ఆమె ఏడుపు విన్న తల్లిదండ్రులు వెంటనే నిద్ర లేచారు. అయితే ఆ గ్రామానికి రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల 10 కి.మీ నడిచి ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో ఆప్పటికే చిన్నారి శరీరమంతా విషం వ్యాపించింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

మృతురాలు దనుష్క(పాత ఫొటో)

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం పరీక్షల కోసం అడుక్కంపరై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం పరీక్షలు పూర్తయిన తర్వాత చిన్నారిని మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే చిన్నారి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల మార్చురీ వాహనం కొంత దూరం తీసుకెళ్లి దింపేసింది. ఆ తర్వాత చిన్నారి మృతదేహాన్ని మోసుకుంటూ ఆమె తల్లిదండ్రులు స్వగ్రామానికి చేరుకున్నారు.

చిన్నారిని మోసుకుంటూ వెళ్తున్న కుటుంబ సభ్యులు

హోటల్ గదిలో జంట మృతదేహాలు
ఉత్తర్​ప్రదేశ్ గాజియాబాద్​లోని ఓ హోటల్​ గదిలో ప్రేమ జంట విగతజీవులుగా పడి ఉండడం స్థానికంగా సంచలనం రేపింది. యువతికి రెండు నెలల క్రితం వివాహం కాగా.. ఆమె తన భర్తను వదిలేసి ప్రియుడితో వచ్చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోదీనగర్​కు చెందిన ఆ యువతికి రెండు నెలల క్రితం అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. యువతికి వివాహం కాకముందే మరో యువకుడితో ప్రేమలో ఉంది. అయితే కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడం వల్ల ప్రేమికులు పెళ్లి చేసుకోలేకపోయారు. యువతికి వేరే వ్యక్తితో వివాహం చేశారు ఆమె కుటుంబ సభ్యులు. అయినా ప్రియుడి మీద ఉన్న ప్రేమ యువతికి తగ్గలేదు. దీంతో ఆమె తన ప్రియుడితో కలిసి భర్తను వదిలేసి పారిపోయింది. కదరాబాద్ ప్రాంతంలోని ఓ హోటల్​లో ప్రియుడితో కలిసి ఆదివారం రూమ్​ తీసుకుంది. అంతలోనే ఏమైందో తెలీదు.. హోటల్ సర్వర్.. గది తలుపులు తీసేసరికి ఇద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే హోటల్ సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రెండు మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

కాగా.. ఘటనాస్థలిలో ఎటువంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం పరీక్షల నివేదిక వచ్చాక ఇది హత్యా? లేక ఆత్మహత్య అనేది తెలుస్తుందని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడే.. తన ప్రియురాలిని హత్య చేసి..తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.

వ్యాపారవేత్త హత్య..
ఓ హోటల్ వెయిటర్​.. గుజరాత్​కు చెందిన వ్యాపారవేత్తను హత్య చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఠాణెలోని ప్రిన్స్ హోటల్​లో శనివారం జరిగింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గుజరాత్​కు చెందిన కరాభాయ్​ రాంభాయ్​(65) అనే గుజరాత్​కు చెందిన వ్యాపారవేత్త.. ఠాణెలోని ప్రిన్స్‌ హోటల్‌లో శనివారం దిగారు. ఆయనపై హోటల్ వెయిటర్ రాజన్ శర్మ విచక్షణారహితంగా పదునైన ఆయుధంతో దాడి చేశాడు. దీంతో వ్యాపారవేత్త కరాభాయ్ అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందుతుడిపై కేసు నమోదు చేసుకున్నారు. వ్యాపారవేత్త హత్యకు గల కారణాలు తెలియలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Last Updated : May 30, 2023, 10:29 AM IST

ABOUT THE AUTHOR

...view details