మహారాష్ట్రలో తనతో సహజీవనం చేసిన ప్రియురాలిని ఓ కిరాతకుడు చంపిన ఘటన మరవకముందే అలాంటి దారుణం మరొకటి జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో తనతో ఏడేళ్లు సహజీవవం చేసిన మహిళను కడతేర్చాడు ఓ వ్యక్తి. మృతదేహాన్ని నిర్మాణంలో ఉన్న ఇంటి సెప్టిక్ ట్యాంక్‌లో పడేశాడు. అనంతరం మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మృతురాలి కుటుంబ సభ్యులతో కలిసి.. ఏం తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కర్చన పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంజల్వైశ్ అనే గ్రామంలో రాజకేశర్ అనే మహిళ నివసిస్తోంది. ఆమె తండ్రి చనిపోవడం వల్ల టైలరింగ్ చేసి.. తన చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేసింది. అయితే, ఏడేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన ఆశిష్ అలియాస్ అరవింద్‌తో రాజకేశర్కు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారిద్దరి సహజీవనం ఏడేళ్ల పాటు సజావుగానే సాగింది. ఈ విషయం రాజకేశర్ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు.
ఈ క్రమంలో అరవింద్‌కు మరో మహిళతో మే 28న పెళ్లి నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు రాజకేశర్.. ఆ పెళ్లిని వ్యతిరేకించింది. దీంతో రాజకేశర్ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని అరవింద్ పథకం పన్నాడు. అందులో భాగంగా మే 24న రాజకేశర్ను నిర్మాణంలో ఉన్న ఓ ఇంటికి పిలిచాడు. అనంతరం ఆమె గొంతు కోసి చంపేశాడు. మృతదేహాన్ని అక్కడే కొత్తగా నిర్మిస్తున్న సెప్టిక్ ట్యాంక్‌లో పడేశాడు. ఎవరికీ తెలియకుండా ఉండేందుకు మృతదేహంపై ఇసుక పోశాడు. ఆ తర్వాత సెప్టిక్ ట్యాంక్‌కు సిమెంట్‌తో ప్లాస్టరింగ్ చేయించాడు.
రాజకేశర్ కనిపించకపోయే సరికి ఆమె కుటుంబ సభ్యులు కంగారు పడి.. ఆమె కోసం వెతితారు. ఎవరికీ అనుమానం రాకుండా అరవింద్ కూడా వారితో కలిసి రాజకేశర్ ఆచూకీ కోసం గాలించాడు. ఈ క్రమంలో మే 28న వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత బాధితురాలి కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో అరవింద్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు.. తమదైన శైలిలో విచారించారు. దీంతో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.
తాను పెళ్లి చేసుకోవడాన్ని రాజకేశర్ వ్యక్తిరేకించిందని.. అందుకే ప్లాన్ ప్రకారం గొంతు కోసి చంపానని చెప్పాడు. జరిగిన విషయాన్ని దాచిపెట్టేందుకు మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో పడేసిట్లు అంగీకరించాడు.
మృతదేహాన్ని పడేసిన సెప్టిక్ ట్యాంక్ బీజేపీ నేత మృతి.. ఛాతీలో బుల్లెట్..
Nishant Garg Meerut : ఉత్తర్‌ప్రదేశ్ మేరఠ్‌లో దారుణం జరిగింది. బీజేపీ యువ మోర్చా మీడియా ఇంఛార్జ్ నిశాంత్ గార్గ్.. ఛాతీలో బుల్లెట్ గాయాలతో తన ఇంట్లో విగత జీవిగా పడి ఉండటం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ బృందాన్ని కూడా పిలిపించారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..నిశాంత్‌ను అతడి చిన్నతనంలో అశోక్పురిలో ఉండే ఆనంద్ కుమార్ గార్గ్ అనే వ్యక్తి దత్తత తీసుకున్నాడు. నిశాంత్.. సోనీ అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో సోనీపై నిశాంత్ దాడి చేశాడు. దీంతో సోనీ శుక్రవారం వేకువజామున ఉదయం 3 గంటల సమయంలో తన పుట్టింటికి వెళ్లిపోయింది. కోపం తగ్గాక సోనీ సాయంత్రం 6.30 గంటలకు ఇంటికి చేరుకునే సరికి.. ప్రధాన గేటు తెరిచి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా మంచంపై నిశాంత్ పడి ఉన్నాడు. అతడి పక్క రివాల్వర్, కొంత దూరంలో మొబైల్ పడి ఉన్నాయి. అనంతరం నిశాంత్‌ను లేపడానికి సోనీ ప్రయత్నించింది. నిశాంత్ ఎంతకూ లేవకపోవడం వల్ల తన భావ రింకూకు ఫోన్ చేయగా.. అతడు అరగంటలో ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.