Boyfriend Killed His Lover: తాను కానుకగా ఇచ్చిన స్మార్ట్‌ఫోన్ తిరిగివ్వలేదని ప్రేయసిని గొంతు కోసి హత్య చేశాడో ప్రియుడు. ఈ దారుణ ఘటన ఝార్ఖండ్‌లోని పాకుర్ జిల్లాలో జరిగింది. 'బాలిక(17)తో నిందితుడు గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. తరచూ అమ్మాయి గదికి వస్తుండేవాడు. అప్పుడప్పుడు రాత్రుళ్లు కూడా అక్కడే గడిపేవాడు. అతని వివాహం మరో అమ్మయితో కుదిరింది. దీంతో తాను కానుకగా ఇచ్చిన సెల్‌ఫోన్‌ను తిరిగి ఇవ్వాలని ప్రేయసిని అడిగాడు. కానీ అందుకు ఆమె నిరాకరించింది. ఈ విషయంలో ఇరువురు గొడవపడ్డారు. ఆదివారం రాత్రి ఫుట్‌బాల్ మ్యాచ్‌కు నిందితునితో కలిసి వెళ్లిన తర్వాత అమ్మాయి కనిపించకుండా పోయింది' అని బాధితురాలు మామయ్య తెలిపారు.
స్మార్ట్‌ఫోన్ గిఫ్ట్ తిరిగివ్వలేదని.. ప్రియురాలి గొంతు కోసి.. - Boyfriend Killed His Lover in Jarkhand
Boyfriend Killed His Lover: కానుకగా ఇచ్చిన స్మార్ట్‌ఫోన్ తిరిగివ్వలేదని ప్రేయసిని గొంతు కోసి హత్య చేశాడో ప్రియుడు. ఈ దారుణ ఘటన ఝార్ఖండ్‌లోని పాకుర్ జిల్లాలో జరిగింది.
ఈ ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ఆచూకీని కనుగొన్నారు. నిర్జన ప్రదేశంలో ఆ అమ్మాయి మృతదేహం కనిపించిందని తెలిపారు. ఈ కేసులో నిందితున్ని అరెస్టు చేశారు. 'ఫుట్‌బాల్ మ్యాచ్ నుంచి తిరిగివస్తుండగా.. పదునైన ఆయుధంతో తన ప్రియురాలి గొంతును కోసినట్లు నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. అనంతరం ఘటనస్థలం నుంచి పారిపోయాడు.' అని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి:భూమి లాక్కొని అక్రమ మైనింగ్.. విషం తాగి రైతు ఆత్మహత్య!
TAGGED:
Boyfriend Killed His Lover