Boyfriend killed Girlfriend in Bachupally : సమాజంలో రోజురోజుకు ఆడవారిపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. మహిళలు కనిపిస్తే చాలు.. క్రూరమృగాలుగా మారి అఘాయిత్యాలకు పాల్పడుతున్నవారు కొందరు. వావి వరసలు మరిచి అత్యాచారాలకు తెగబడుతున్నవారు మరికొందరు. ప్రేమిస్తున్నామంటూ వెంట పడతారు.. అమ్మాయి ఒప్పుకోకపోతే ఎంతకైనా తెగిస్తారు. తనకు అమ్మాయి దక్కలేదనే కక్షతో దాడులకు తెగబడుతున్నారు. అంతేకాదు.. ప్రాణాలు సైతం తీసేందుకు వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. కానీ ఇక్కడ జరిగింది వేరు.
వారివురు ప్రేమించుకున్నారు. కొంతకాలం బాగానే గడిచింది. ఆ యువతి తనను వివాహం చేసుకోవాలని సదరు యువకుడిపై ఒత్తిడి తెచ్చింది. మరోవైపు అతనికి వేరే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం ప్రేమించిన అమ్మాయికి తెలిసింది. దీనిపై ప్రియుడిని నిలదీసింది. ఎలాగైనా ప్రియురాలిని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే మాట్లాడుకుందామని బయటకు పిలిచాడు. ఈ నేపథ్యంలోనే ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అప్పుడే అటుగా వస్తున్న వాటర్ ట్యాంకర్ కిందికి ఆమెను తోసివేయడంతో.. అక్కడిక్కడే బాధితురాలు ప్రాణాలు వదిలింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని బాచుపల్లిలో చోటుచేసుకుంది.
యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది
Bachupally Road Accident Today : ప్రేమించిన యువకుడే ప్రియురాలిని ట్యాంకర్ ముందుకు తోసివేయడంతోనే మృతి చెందినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం నెమలిగుట తండాకు చెందిన ప్రమీల.. బాచుపల్లిలో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తూ.. ఓ వసతి గృహంలో ఉంటుందని తెలిపారు. మరోవైపు అదేజిల్లాలోని రోడ్డు తండాకు చెందిన తిరుపతి హాఫీజ్‌పేటలో ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని చెప్పారు. ఈ క్రమంలోనే వీరివురు ఐదు నెలలుగా ప్రేమించుకుంటున్నారని వివరించారు.